అమరావతిలో మహిళా పార్లమెంట్

  • ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు

వచ్చే ఏడాది ప్రారంభంలో అమరావతి వేదికగా జరగబోయే తొలి నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్  డా.కోడెల శివప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. బుధవారం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో దాదాపు మూడు గంటలకు పైగా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  ఇందులో కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై కసరత్తు జరిగింది. పుణె లోని ఎం ఐ టి  ప్రతినిధి రాహుల్ కరాడ్, స్పెషల్ ఆఫీసర్ రామలక్ష్మి, సభాపతి  ఓ ఎస్ డి గురుమూర్తి, ఇతర అసెంబ్లీ అధికారులు చర్చలో పాల్గొన్నారు. వివిధ కమిటీల ఏర్పాటు, మూడు రోజుల ఎజండా తయారిపై సమాలోచన చేసారు. ఆ తర్వాత సదస్సు నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన కోసం డా.కోడెల శివప్రసాదరావు విభిన్న ప్రాంతాలలో పర్యటించారు. ప్రాధమికంగా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమ ప్రాంతం ఆన్ని విధాల అనువైనదిగా భావించారు. ఐతే మరిన్ని  ప్రాంతాలను చూడడానికి నిర్ణయించారు.  

పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌రుస్తోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్ల‌మెంట్ , శాసన సభ్యులు పాల్గొంటారు. దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు.  వసతి , ఇతర  అంశాలపై  విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీర పాండ్యన్ , సబ్ కలెక్టర్ లక్ష్మీషా తదితరులతో సభాపతి కోడెల చర్చించారు. యునెస్కో, సైతం ఈ సదస్సులో భాగస్వామి కాబోటోంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ లు కూడా ఈ సమావేశాల నిర్వహణకు తోడ్పాటు నిస్తున్నాయి.  

ఈ సదస్సులో రాజకీయాలలో మహిళలకు ప్రోత్సాహంతో ముడి పడిన అనేక అంశాలను చర్చిస్తారు. మూడవ రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తారు. ప్ర‌తి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉండాల‌ని స‌భాప‌తి నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీకి ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ను ఛైర్మెన్ గా ఉంటారు. సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published.