నవ్వులు పంచుతున్న ‘విన్నర్’ టీం  

ప్రస్తుతం ఏ సినిమాకు అయినా కామెడీ చాలా ముఖ్యం. స్టార్ హీరో  చేసిన దెయ్యం సినిమా అయినా సరే.. కామెడీ మస్ట్. అయితే సినిమాల్లో కామెడీ చేయడం ఒక ఎత్తయితే.. ఆన్ ది సెట్స్ నవ్వులు పంచేవాళ్లు బోలెడు మంది ఉంటారు. మరి సెట్స్ పై పండే నవ్వులను.. ఫీలింగ్స్ తో కూడిన ఫోటోలతో షేర్ చేస్తూ.. ‘విన్నర్’ టీం ఇరగదీసేస్తోంది.

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్ ,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో విన్నర్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. గజ గజ వణికిస్తున్న చలిలో ఈ మూవీ యూనిట్‌ జర్కిన్స్ వేసుకొని మరి షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల అక్కడి పరిస్థితులకు సంబంధించిన వీడియోని టీం షేర్ చేసింది

తాజాగా  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనిలతో కూడిన ఓ ఫోటోను షేర్ చేశాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఆ ఫోటోలో ఉన్న కంటెంట్ ఏంటంటే రకుల్ నీకు ప్యాకప్ అంటాడు దర్శకుడు. మరి నాకు అని తేజు క్వశ్చన్ మార్క్‌ పెట్టగానే  ..నీకు మేకప్ అంటాడు.  అప్పుడు సాయి ధరమ్ తేజ్ ఏడుపు మొహం పెట్టేస్తాడు. రకుల్ నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా ఉక్రెయిన్  షూటింగ్ లో భాగంగా అక్కడి నుంచే షేర్ చేసిన సంగతులు.

పక్క దేశాలకు వెళ్లిపోయి అట్మాస్ఫియర్ ను షూటింగ్ ను ఎంజాయ్ చేయడమే కాదు.. ఆఫ్ స్క్రీన్ జోకులను కూడా పంచేస్తోంది విన్నర్ టీం. ఇంతకు ముందు కూడా తేజు.. వెన్నెల కిషోర్.. గోపీచంద్ ల కలిసి కొన్ని జోకులు ఇలాగే షేర్ చేయగా.. అన్నీ విపరీతంగా పేలాయి. వీరు చేస్తోన్న ప్రమోషన్స్ కి మంచి అప్లాజ్ వస్తోండగా టీం ఫుల్‌ ఖుష్‌ అవుతోంది. డిసెంబర్ లో కాని, లేదంటే వచ్చే ఏడాది కాని ఈ చిత్ర రిలీజ్ కి యూనిట్  ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published.