అమితాబ్ ను ఎందుకు కలిశాడబ్బా?!

మొన్న బాలకృష్ణ సర్కార్ 3 సెట్ కి వెళ్ళి అమితాబ్ ను కలిసివచ్చిన సంగతి తెలుసు.  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా సర్కార్ 3 సెట్ కి వెళ్ళి అమితాబ్ ను కలిసి వచ్చాడు. ఆ కలయిక అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోనూ చర్చకు దారితీసింది. జక్కన అమిత్ తాబ్ ని కలవడానికి రెండు కారణాలు చెబుతున్నారు.

బాహుబలి- 2 రిలీజ్ విషయంలో కరణ్ జోహార్ కి, నిర్మాతలకు సయోధ్య కుదరటం లేదని ఒక టాక్. బాలీవుడ్ లో బాహుబలి-1 ప్రమోషన్ బాధ్యతను తీసుకున్న కరణ్ జోహార్ అందులో బాగా సంపాదించాడని తెలిసినదే. అయితే ఇప్పుడు కొంచెం ఆర్థిక సమస్యలో ఉన్నాడంటున్నారు. దాంతో బాలీవుడ్ లో ఒక పెద్ద అండకోసమే రాజమౌళి బిగ్ బిని కలిసినట్టు ఒక ఊహాగానం.  అమితాబ్ తో తను ప్లాన్ చేయబోయే సినిమా ప్రాజెక్టులో భాగంగా కలిశాడని మరో ఊహాగానం.

రాజమౌళి సర్కార్- 3 సెంట్ లో అమితాబ్ ని కలిసినట్టు వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఎప్పుడూ ఎవరినీ పొగడని వర్మ ఈసారి రాజమౌళిని తన ట్విట్టర్ లో పొగిడాడు. రాజమౌళి భారతీయ సినిమా టెక్నాలజీ ఖ్యాతిని పెంచినందుకు నా సెల్యూట్ అని ట్వీట్ చేసాడు. మరి రాజమౌళి చాలా పెద్ద కారణంతోనే అమితాబ్ ని కలిసాడని, వీరిద్దరి కలయిక భారతీయ సినిమాకు ఒక గొప్ప వారం కాగలదని పలువురు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.