పవన్ తమిళ్ టూర్ దేనికో?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, ఆయన ఇప్పుడు ఏది చేసిన సంచలనమే. ప్రస్తుతం ఈ హీరో ఇటు సినిమాలతో అటు రాజకీయాలలో బిజీగా ఉంటున్నాడు. ఇక ఆయన అభిమానులు పవన్ ప్రతి కదలికను పసిగడుతూనే ఉన్నారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోను తాము పాలుపంచుకుంటామనే సంకేతాలిస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ రామేశ్వరం వెళ్ళనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కి రామేశ్వరం కి లింకేంటి, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళబోతున్నాడని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి తమిళనాడు పర్యటన ఎందుకు చేస్తున్నాడు? పాలిటిక్స్ సంబంధించి వెళ్తున్నాడా, లేదంటే ఆయన నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ పనిమీద రామేశ్వరం వెళ్తున్నాడా అనే అనుమానం అందరిలోను ఉంది. అయితే పవన్ టూర్ పక్కా కాటమ రాయుడు సినిమా షూటింగ్‌ కోసమే అని చెబుతున్నాయి చిత్రవర్గాలు. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఓ పది రోజుల ముందే పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా,  కొన్నిసన్నివేశాల చిత్రీకరణకు అక్కడికి వెళుతున్నాడు.

పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్‌ చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కాటమరాయడు. ఈ చిత్రం వీరంకి రీమేక్ గా తెరకెక్కుతోంది. తాజాగా  హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన డాలీ అండ్ కో, తర్వాతి షెడ్యూల్ కోసం లొకేషన్ షిఫ్ట్ అయింది. అక్టోబరు 5 నుంచి రామేశ్వరంలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ ఎక్కువ రోజులే సాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్ కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ గుడికి వెళ్లినా షూటింగుకి ఇబ్బందులు తప్పవు కాబట్టి,  తమిళనాట అయితే ప్రశాంతంగా షూటింగ్ చేసుకొవచ్చిని యూనిట్‌ భావించినట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ నుంచే హీరోయిన్ శ్రుతి హాసన్ ‘కాటమరాయుడు’ టీంతో జాయిన్ అవుతుంది. పవన్-శ్రుతి కాంబినేషన్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పవన్ మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published.