రాజమౌళి ఏం చేయబోతున్నాడు?

రాజమౌళి తరువాత ఏం చేయబోతున్నాడు? బాహుబలి2 తరువాత జక్కన ఆలోచన ఎటు పరుగు తీస్తుంది. బాహుబలి ఇచ్చిన జోష్ తో మళ్లీ భారీ సినిమానే ఎంచుకుంటాడా? లేదంటే కాస్త నెమ్మది పడి రూటు మారుస్తాడా? ఇదే సన్నిహితులనుండి కామన్ పీపుల్ వరకు ఆలోచిస్తున్న అంశం. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమైవుంటుంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం మేరకు రాజమౌళి బాహుబలి2 తరువాత హీరో నానితో సినిమా చేయనున్నాడట. గతంలో నానితో చేసిన ఈగ సినిమాకు సీక్వెల్ గా మరో చిత్రం రానుందని అంటున్నారు. రాజమౌళి మగధీర భారీ విజయం తరువాత సునీల్ తో మర్యాదరామన్నలాంటి సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. అదే ఫార్ములాతో  బాహుబలి2 తరువాత కొంత రెస్ట్ తీసుకుని ఈగ2 తెరకెక్కిస్తాడని టాక్.

వాస్తవానికి ఈగ లాంటి సినిమా చాలా పెద్ద సినిమాగానే పరిగణించాల్సి వుంటుంది. అయితే ప్రస్తుతం డైరెక్టర్ గా రాజమౌళి స్థాయికి ఈగ లాంటి సినిమా కూడా చిన్నదిగ చూడాల్సిన అవసరం ఏర్పడింది. జక్కన 2009 లో మగధీర సినిమా తరువాత 2010 లో మర్యాధ రామన్న, 2012 లో ఈగా సినిమాలు తెరకెక్కించాడు. మళ్ళీ బాహుబలి 2 తరువాత ప్రయోగాత్మకమైన ఈగ2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. కాగా ఇందులో మళ్లీ నానినే హీరోగా తీసుకుంటుండగా సమంత ప్లేస్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారనేది సస్పెన్స్.

ప్రస్తుతం రాజమౌళి దృష్టంతా బాహుబలి2 విడుదల పైనే వుంది. బాహుబలి తీసుకువచ్చిన హైప్ తో బాహుబలి2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలను చేరుకునే తీరులో బాహుబలి2 నిర్మించామని అంటున్నారు. ఇప్పటికి రెండు పాటల చిత్రీకరణ మినహా టాకీ పార్ట్ అంతా పూర్తి అయిందనే విషయాన్ని రాజమౌళినే చెప్పిన సంగతి తెలిసిందే. ఈగ2 విషయంలో అఫీషల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడిస్తాడో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.