ఎంత ‘బరువు’ సమస్యో!

సినిమా యాక్టర్లు గ్లామర్ ను కాపాడుకోడంలో ఎక్స్ పర్ట్స్. పదికాలాలపాటు  అందంగా ఉండడానికి పాపం రకరకాల అవస్థలు పడుతుంటారు. ఈ విషయంలో హీరోకంటే హీరోయిన్లే  చాలా జాగ్రత్తలు తీసుకుంటారేమో అనిపిస్తుంది. అందాన్ని, గ్లామర్ ను కాపాడుకోవడమే కాదు . .. ఈ మధ్య శరీరం వెయిట్ ను తగ్గించుకోడానికి, పెంచుకోడానికీ కూడా తెగ కష్టపడుతున్నారు. ఎవరెవరు ఏం చేశారో, చేస్తున్నారో చూద్దాం.

కొన్ని సినిమాలకోసం, తాము చేసే కొన్ని  పాత్రలకోసం  నటీనటులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక పాత్ర చేస్తుండగానే  ఆ కేరక్టర్ లో వచ్చే వేరియేషన్స్  చూపించాల్సి వస్తోంది. బాహుబలి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, రానా కథలో తమ పాత్ర అవసరానికి తగ్గట్టు శరీరం బరువు తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయాల్సి వస్తోంది. పైగా కొన్ని రోజుల వ్యవధిలోనే  కిలోల బరువు తగ్గించుకోవడమే, పెంచుకోవడమో జరగాలి.

హఠాత్తుగా శరీరం బరువు తగ్గించుకోవడం, పెంచుకోవడం చాలా కష్టమైన ఫీటే కాకుండా ఆరోగ్యంపై కూడా దాని ప్రభావం పడుతుంది. ప్రభాస్, రానా మాత్రమే కాక హీరోయిన్ అనుష్క కూడా గత ఏడాది సైజ్  జీరో సినిమా కోసం కొంతకాలం తన వెయిట్ ను పెంచుకోవాల్సి వచ్చింది. మళ్లీ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకోసం లావెక్కితే మరో సినిమాకు పనికిరారు కదా? మరదే. సినిమాల్లో నటించడమంటే  తమాషా కాదు.

సినిమా నటీనటులు  నటనతోపాటు  శరీరాకృతిపై కూడా  ఫోకస్ ఉంచాలి. శరీరాకృతి సరిగా లేకపోతే .. .. సినిమాలకు పనికిరావు పొమ్మంటారు. పెళ్లయిన హీరోయిన్స్ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. టీవీ యాంకర్ కమ్ సినీ నటి అనసూయ కూడా బాడీ విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. సాయిధరమ్ తేజ్ మూవీలో ఐటం సాంగ్ చేసిన అనసూయ ఆ పాటకోసం 10 కేజీల బరువు పెరిగిందట.  

బరువు పెరిగినందుకు తను అంతగా బాధపడడం లేదని, తగ్గించుకో వచ్చని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published.