వివాదంలో విశాల్

సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా ఎప్పుడు మీడియా ముందుండే విశాల్ మరోసారి కాంట్రవర్సీతో తెరమీదకు వచ్చాడు. నడిగర్ సంఘం విశాల్ కు తమిళ నిర్మాతల మండలి టీఎఫ్ పీసీ షాక్ ఇచ్చింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వీఎఫ్ఎఫ్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. చాలా కాలంగా వివిధ రకాల వివాదాలతో నలిగిపోతున్న విశాల్ కి ఇది మరో షాక్ అని చెప్పవచ్చు.

తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యత్వం నుంచి నటుడు, నిర్మాత విశాల్ ను తాత్కాలికంగా తొలగించారు. ఈ మేరకు మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నాడులోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విశాల్.. మండలి నియమ నిబంధనలను కించ పరిచేలా వ్యాఖ్యానించాడని, వివరణ కోరినప్పుడు ఆయన ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదని నిర్మాతల మండలి పేర్కొంది.

నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంలో విశాల్ అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఎన్నో సందర్భాల్లో విశాల్ దూకుడు గా ప్రవర్తించి తన ఉనికిని చాటుకున్నాడు. సూటిగా బెరుకులేకుండా మాట్లాడే విశాల్ నిర్మాతల మండలి వైఖరిని కించపరిచినట్టుగా వచ్చిన అభియోగంతో ఆయన్ను తాత్కాలికంగా మండలి సభ్యత్వంనుండి తొలగించారు.

నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని విశాల్ ఛాలెంజ్ చేస్తున్నాడు. తను  సంఘం రూల్స్ ను కించ పరిచేలా వ్యాఖ్యానించలేదని, మండలి నిర్ణయాన్ని  చట్ట పరంగా ఎదుర్కొంటానని విశాల్ అంటున్నాడు. నేను నిర్మాతల సంక్షేమాన్ని కోరుతా.. అలాంటిది కించ పరిచే వ్యాఖ్యలు ఎందుకు చేస్తాను అని విశాల్ ప్రశ్నించాడు. రాబోయే మండలి ఎన్నికల్లో తమ వర్గం పోటీ చేస్తుందని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published.