విజయ్ తో హారర్ కామెడీ

అదివరకు హారర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ తర్వాత ఆ ట్రెండ్ తగ్గింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. అయితే కేవలం హారర్ చూపించి ఆడియన్స్ ను రప్పించుకోవడం కష్టమని అనుకున్న ప్రొడ్యూసర్లు హారర్ కు కామెడీని మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఓ ఫ్యామిలీ హీరోతో హారర్ కామెడీ మూవీకి ప్లాన్ చేస్తున్నారు.

ఈమధ్య హారర్ కామెడీ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రేమకథా చిత్రమ్ తో ఈ ఒరవడి మొదలైంది. కామెడీ యాడ్ చేయడంతో ఈ తరహా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. వాటిలో యాక్షన్ హీరోలనే తీసుకుంటున్నారు కానీ, ఫ్యామిలీ మూవీలో నటించిన హీరోకి ఇలాంటి పిక్చర్ లో నటించే ఛాన్స్ వచ్చింది. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ ఓ హారర్ కామెడీ మూవీలో చేయబోతున్నాడు.

హారర్ మూవీలో నటించేందుకు యువ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఆ ఛాన్స్ వచ్చింది. పెళ్లిచూపులు తీసిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ హారర్ మూవీని తీయబోతోంది.  ప్రస్తుతం ద్వారకలోను, మరో మూవీలోను చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాలు కంప్లీట్ కాగానే ఈ హారర్ సినిమాలో చేస్తాడట. దయ్యం బ్యాక్ డ్రాప్ గా ఈ స్టోరీ నడుస్తుంది.

ఇటీవల వచ్చిన ఎక్కడికీ పోతావు చిన్నవాడ  పిక్చర్ కూడా హారర్ కామెడీ మూవీయే.  విజయ్ దేవరకొండతో తీసే సినిమా దయ్యం బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుంది. హారర్ , క్రైమ్ అంశాలతో  లోగడ వచ్చిన  ప్రేమకథా చిత్రమ్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఫ్యామిలీ మూవీలో నటించిన విజయ్ ఈ హారర్ మూవీలో ఎలా నటిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.