ఎరక్కపోయి ఇరుక్కున్నానే!

పెద్ద నోట్ల రద్దు పై తమిళ హీరో విజయ్ స్పందించాడు. ఈ నోట్ల రద్దుతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే సినిమాలు ఎక్కువగా ఆగిపోయాయని అంటున్నారు. దీనిపై ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు స్పందించగా ఇప్పుడు హీరో విజయ్ కూడా స్పందించి విమర్శల పాలవుతున్నాడు.

పెద్ద నోట్ల రద్దును సినీ ప్రముఖులంతా స్వాగతించారు. నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అందరు అభినందించారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి కేంద్ర చేస్తున్న కృషిని కొనియాడారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఆర్ధిక స్వచ్ఛ్ భారత్ ఇలానే సాధ్యమంటూ కొనియాడాడు. ఇదిలా వుంటే తమిళ హీరో విజయ్ కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు.

పెద్దనోట్ల రద్దుపై మీడియా విజయ్ అభిప్రాయాన్ని అడిగింది. దీనికి స్పందించిన విజయ్ పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల నల్లధనం అరికట్టవచ్చని, అయితే దేశంలో నల్లధనం వున్నవారు కేవలం ఒక 20 శాతం వుంటారేమో కానీ,  వారికోసం 80 శాతం మంది సఫర్ అవుతున్నారని అన్నాడు. దీంతో విజయ్ పై విమర్శలు వస్తున్నాయి. దేశాభివృద్దికోసం ఆ మాత్రం జనం సహకరించకపోతే ఎలా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రభుత్వం ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం మంది సామాన్య జనం కష్టాలు పడే వారు కాదని విజయ్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దును ముందే ప్రకటిస్తే నల్లధనం వున్నవారు జాగ్రత్త పడరా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి యాంటీగా ఎవరు మాట్లాడినా విమర్శలు ఎదుర్కోక  తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published.