“కేసీఆర్ పై మూవీ ప్లాన్ మొదట నాదే”

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం పై సినిమా తీస్తామని మధుర శ్రీధర్ ప్రకటించిన రోజే, రాంగోపాల్ వర్మకూడా తనుకూడా తీస్తున్నానని ఎనౌన్స్ చేసాడు. వర్మ కావాలని పోటీతో ఈ ప్రకటన చేసాడా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. వర్మ లాంటి పెద్ద డైరెక్టర్ ఇలా చేయడంపై విమర్శలు కూడా తలెత్తాయి. అయితే వర్మ కేసీఆర్ పై సినిమా తీయడానికి వెనుక ఓ విషయం వుంది. తనను గట్టిగా ప్రేరేపించిన అంశం కూడా వుంది. అందుకే వెంటనే ఎనౌన్స్ చేసాడట.

 డైరెక్టర్, నిర్మాత అయిన మధుర శ్రీధర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీధర్ అలా ఈ విషయాన్ని బయటపెట్టాడో లేదో, వర్మ ట్విట్టర్ వేదికగా తను కూడా కేసీఆర్ జీవితం పై మూవీ చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేసాడు. తన ట్విట్టర్ లో కేసీఆర్ ను తెలంగాణా బ్రూస్లీగా కూడా అభివర్ణించాడు.

ఒకే వ్యక్తి గురించి ఇద్దరు డైరెక్టర్లు సినిమా తీయడంలో తప్పేమీ లేకపోయినప్పటికి మధుర శ్రీధర్ ఎనౌన్స్ చేసిన వెంటనే వర్మ కూడా తన సినిమాగురించి చెప్పడంతో విమర్శలు తలెత్తాయి. అంత అర్జంట్ గా ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే అందుకు రీజన్ వుందంటున్నాడు రాంగోపాల్ వర్మ.

రాంగోపాల్ వర్మ కేసీఆర్ జీవితంపై సినిమా చేయలని ఎప్పటినుండో ప్లానింగ్ లో వున్నాడట. అందుకే అప్పుడప్పుడు ఆయన్నుపొగుడుతూ కామెంట్స్ కూడా చేసేవాడు. కాగా రాంగోపాల్ వర్మ చాలా కాలం క్రితమే కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యాడట.ఆ సందర్భంలోనే అతి త్వరలో కేసీఆర్ పై సినిమా చేయాని నిర్ణయించుకున్నాడట వర్మ.

రాంగోపాల్ వర్మ మధురా శ్రీధర్ లు వెంటవెంటనే కేసీఆర్ సినిమా గురించి ఎనౌన్స్ చేయడం యాధృచ్చికమే నని అంటున్నారు. ఇప్పటికే బయోపిక్ లు చేయడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న వర్మ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని ఏవిధంగా తెరకెక్కిస్తాడో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.