వర్మ వర్సెస్ రాధ

ఎప్పుడు తనదే ముందంజ వుండాలనుకునే వర్మ ఈ సారి ఒక స్టెప్పు వెనక్కు వేసాడు. సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నాడో? ఒత్తుడిలు ఒక రేంజ్ లో వచ్చాయో తెలియదు కాని వంగవీటి రంగ సినిమా విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అంతే కాదు తన స్టైల్ మార్చి మరీ ట్వీట్లు చేసాడు. ఈ రోజు ఆడియో రిలీజ్ చేసుకుంటున్న వంగవీటి సినిమా పై జరుగుతున్న తాజా పరిణామాలను మీరు కూడా పరిశీలించండి.

వంగ వీటి సినిమా విషయంలో వర్మ ఒకడుగు వెనక్కి వేసాడు. వర్మ మూవీ ‘వంగవీటి’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇందులోని‘కమ్మ కాపు..’ అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ స్పష్టంచేశాడు.  కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్మ తన ట్వీట్‌‌లో తెలిపాడు. ఇప్పటి వరకు వర్మ ఎదుటి వాళ్ళ భావోద్వేగాలగురించి పెద్ద పట్టించుకుంది లేదు. అటువంటిది ఎప్పుడు లేని విధంగా కొత్త గా ట్వీట్ చేసాడు.

వంగవీటి భావోద్వేగాలతో కూడిన చిత్రమని వర్మ చెప్పుకొచ్చాడు, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్‌ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో ‘వంగవీటి’ సినిమా రానుందని అంటున్నాడు. వంగవీటి సినిమా వాస్తవాలను తుంగలో తొక్కేలా వుండే అవకాశం వుందని వంగవీటి రంగ కుమారుడు రాధ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వర్మ కమ్మ కాపు సాంగ్ ను డిలీట్ చేయడంతో గొడవ సర్దుమనిగింది.రాధ పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది.

గతంలో రక్త చరిత్ర సినిమా విషయంలో వచ్చిన ఎన్నో విభేదాలను లెక్క చేయని వర్మ వంగవీటి చిత్రం పై మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. వీలైనంత వరకు కాంప్రమైజింగ్ గా వ్యవహరిస్తున్నాడు. వంగవీటి రాధ ఆగ్రహాన్ని చల్లార్చాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు రాధను కలిసినట్టు తెలుస్తుంది. కాగా ఇవ్వాల్టి ఆడియో ఫంక్షన్ విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయ గ్రౌండ్ లో అట్టహాసంగా జరుగుతుంది. అంతా ఓకే అయితే ఈనెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.