పెళ్లికేం తొందర, సినిమాలు ఉండగా!

పెళ్లి కళ వచ్చేసిందే బాలా .. .. అని మాంఛి హుషారుగా సాగే ఓ సాంగుంది. మన టాలీవుడ్ హీరోల్లో కొందరికి ఆల్ రెడీ పెళ్లి కళ వచ్చినా, పెళ్లి కానివాళ్లూ ఉన్నారు. హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా పెళ్లి వయసు దాటిపోయినా మ్యారేజ్ చేసుకోకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్నవాళ్లున్నారు.  వాళ్లు  పెళ్లెప్పుడు చేసుకుంటారనేదే ఎవరికీ అంతుబట్టని బిగ్ కొశ్చన్ గా మారింది.

హీరోలు ఎవర్ గ్రీన్ గా ఉన్నట్టే  కొందరు హీరోయిన్లు కూడా ఎవర్ గ్రీన్. పదేళ్లకు పైగా మూవీస్ లో చేస్తున్నా ఇంకా ఇప్పటికీ తళతళలాడుతూ మెరిసిపోతున్నారు.

నయనతార, అనుష్క, త్రిష .. .ఈ ముగ్గురు హీరోయిన్లుగా ఇంకా డిమాండ్ లోనే ఉన్నారు. తెలుగు, తమిళ మూవీస్ లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.మూవీస్ తో  బిజీగా ఉండి వాళ్లు తమ వయసును  మరచిపోయి ఉండవచ్చు. అందుకే పెళ్లి కెందుకు తొందర అనుకుంటున్నారేమో. పైగా ఆడవాళ్లు తమ వయసు చెప్పరు కదా. .. అయితే వాళ్లు చెప్పకపోయినా ఈ ముగ్గురూ 30 ఏళ్లను ఎప్పుడో క్రాస్ చేసేశారు. ఆల్ రెడీ కొన్ని మ్యారేజ్ ట్రయల్స్ కూడా అయ్యాయట.  చెన్నై  త్రిషకి ఆమధ్య పెళ్ళి ఫిక్స్ అయి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.

ఆఫ్టర్ మ్యారేజ్  సినిమాలు చేయకూడదని పెళ్ళికొడుకు కండిషన్ పెట్టడంతో త్రిష ఆ పెళ్ళి కాన్సిల్ చేసుకుంది. ఇకపెళ్ళి చేసుకునే ఆలోచన లేదని.. సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తానని  స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక నయనతార ఎప్పుడూ ఏదో క ఎఫైర్‌తో  లైమ్ లైట్ లో ఉంటుంది. కొంతకాలం శింబు, ఆ తర్వాత ప్రభుదేవా, ఇప్పుడు తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివ.  ఇలా నయన్ ఎఫైర్స్  కంటిన్యూ అవుతున్నాయి  కానీ పెళ్ళి ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఈ వరుసలోనే ఉంది ‘అరుంధతి’ అనుష్క. పెళ్ళి గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే త్రిష, నయనతార కంటే అనుష్కకే ఇప్పటికీ క్రేజ్ బాగా వుంది. చేతిలో మూడు సినిమాలున్నాయి. అయినా అనుష్కకి త్వరలోనే పెళ్ళి చేసేయాలని ఆమె  కుటుంబంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎప్పుడనేదే తెలీడం లేదు.

పెళ్లి విషయంలో త్రిష ఇప్పటికే ఒక  నిర్ణయానికి వచ్చింది. ఇక ఇప్పుడు  నయనతార, అనుష్క సంగతే తేలాలి. వీరిద్దరూ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.