నిత్యానందపై టీవీ షో… ఓ హీరోయిన్ కసరత్తు

మనుషుల మనుసుల్లోకి ఒక విషయాన్ని సూటిగా పంపడానికి టివి ఎంతగానో విపయోగపడుతుంది. దానికి తోడు టీవి ఛానళ్ళల్లో వచ్చేవన్నీ నిజాలని నమ్మే జనం కూడా చాలా మందే వున్నారు. వారిని ఆధారంగా చేసుకుని రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు టీవి ఛానల్స్ ని బాగానే వినియోగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే విధమైన స్ట్రాటజీని స్వామి నిత్యానంద వాడుకోబుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ హీరోయిన్ నిత్యానందను తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ చేయాలని ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

సెక్స్ స్కాండిల్ లో వివాదాలను ఎదుర్కున్న స్వామి నిత్యానంద పై త్వరలో ఓ టీవి ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ రానుందని సమాచారం. ఆ ప్రోగ్రామ్ లో స్వామి నిత్యానంద ను పొగుడుతూ ఆయన వైభవాన్ని చాటి చెప్పేలా డిజైన్ చేసారని తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తుంది మరెవరో కాదు, నిత్యానందకు అనుంగ శిష్యురాలైన రంజిత. తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యానంద పాపులారిటిని పెంచాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలుస్తోంది.

రంజిత సినిమా హీరోయిన్ గా కంటే నిత్యానంద శిష్యురాలిగానే ఎక్కువ పరిచయమైంది. నిత్యానంద ఆశ్రమ వివాదంలో ఎక్కువగా రంజిత పేరే వినపడింది. రంజిత తెలుగులో జగపతి బాబు హీరోగా నటించిన మావిచిగురులో నటించి మంచి పేరు సంపాదించింది. ఆ తరువాత ఆమె పేరు విన్నది ఈ నిత్యానంద వివాదంలోనే. ఎన్నో విమర్శలు ఎదుర్కున్నా తరువాత వాటన్నిటినుండి నిత్యానంద బయటపడి మరోసారి వెలుగులోకి రావాలనుకుంటున్నాడనేది టాక్.

త్వరలో తెలుగులో ఓ భక్తి ఛానల్ ప్రారంభం కాబోతుందని అంటున్నారు. ఈ భక్తి ఛానల్ లో నిత్యానందపై రంజిత ఓక కార్యక్రమం చేపడుతుందట. ఇందులో నిత్యానంద గొప్పతనం పై టాపిక్ వుంటుందని అంతా అనుకుంటున్నారు. వాస్తవానికి తెలుగులో రాబోతున్న ఆ భక్తి ఛానల్ నిత్యానంద ఆశ్రమ పెట్టుబడే అని ఒక టాక్ మార్కెట్ లో వుంది. మరి రంజిత నిత్యానందను తన కార్యక్రమంతో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకురాబోతుందో చూడాలి మరి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.