లిమిట్స్ దాటుతున్న ట్రైలర్స్

ఈమధ్య అసలు సినిమాలకంటే కొసరు సినిమాలు, అంటే ట్రైలర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా చూడాలన్న క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. ఇక కొన్ని  ట్రైలర్స్ మరీ రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. బేఫికర్, ఏ దిల్ హై ముష్కిల్, పర్చెడ్ వంటి మూవీ ట్రైలర్స్ సోషల్ మీడియాలో దుమ్ము రేపడమే కాదు…వివాదాస్పదమవుతున్నాయి కూడా.

సినిమా గురించి తెలిపే ట్రైలర్స్ శృతిమించి రాగాన పడుతున్నాయి. సినిమా ప్రచారంకోసం తయారు చేసే ఈ ట్రైలర్స్ మరీ హాట్ గా ఉంటూ హీటెక్కిస్తున్నాయి.  కొన్ని సందర్భాల్లో వివాదాలకు గురవుతున్నాయి. సోషల్ మీడియాలో వీటికి లైక్స్ ఎక్కువగా వస్తున్నా, విమర్శలూ ఆరోపణలూ కూడా ఎక్కువగానే ఉన్నాయి. లేటెస్ట్ గా బాలీవుడ్ మూవీ బేఫికర్ ట్రైలర్ రిలీజైంది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గర రిలీజ్ చేయడం ఓ విశేషం.

బేఫికర్ ట్రైలర్  వెరీ హాట్ గా ఉంది. దీనికి ఇప్పటికే  కోటికి పైగా హిట్స్ వచ్చాయి.  హీరో హీరోయిన్లు రణవీర్ సింగ్ -వాణీకపూర్ రెచ్చిపోయి చేసిన రొమాన్స్ ఈ ట్రైలర్ లో ఉంది. ట్రైలర్ లో లిప్ లాక్ లు, బికినీలే కనబడతాయి. బేఫికర్ అంటూ రణవీర్ సింగ్ కూడా బాడీ ఎక్స్ పోజింగ్ చేస్తూ వంటిపై డ్రాయర్ తో మాత్రమే కనబడ్డాడు.  ఈ  ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా…మరీ ఇలా బరితెగించి యాక్ట్ చేశారేంటి?, అడల్డ్ సినిమాలా ఉంది అని, విలువలు పడిపోతున్నాయి అనీ విమర్శలూ వస్తున్నాయి.

మరో మూవీ పర్చెడ్ ట్రైలర్ కూడా వివాదానికి  దారి తీసింది. ఇందులో రాధికా ఆప్టేను చీలైట్ అండ్ డార్క్ లో నగ్నంగా చూపించారు. ఆ సీన్ లీక్ అయింది. ప్రెస్ మీట్ లో ఓ విలేకరి ఈ పాయింట్ అడిగితే రాధికా ఆప్టే మండిపడింది. షూటింగ్ కు ముందు తనకు చెప్పిన దానికి, షూట్ చేసిన దానికి తేడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఐశ్వర్యారాయ్ – రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ ట్రైలర్ , అందులోని  బుల్లెయ్యా అనే పాట కూడా వివాదాస్పదమయ్యాయి.

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ …రణబీర్ కపూర్ తో మరీ లిమిట్స్ దాటి యాక్ట్ చేసిందని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కూడా దీనిపై దుమారం రేగింది. వ్యవహారం ముదిరి ఐష్ – అభిషేక్ ల విడాకులకు దారితీయవచ్చనీ అంటున్నారు. ఇంక ఈ సినిమాలో బుల్లెయా అనే పాటకు అమెరికాలో తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published.