ఖైదీ నంబర్ 150 ఆడియోకి టాప్ స్టార్స్

వచ్చే సంక్రాంతికి రాబోయే స్టార్ హీరోస్ సినిమాలపై ఇప్పటి నుంచే హై ఎక్స్ పెక్టేషన్స్ రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోల సినిమాలపైనే ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కూ ఎన్నో ఆశలున్నాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి కంప్లీట్ కాగా మరొకటి షూటింగ్ లో ఉంది. ఈ సినిమాలపై రోజుకో ట్విస్ట్ వస్తోంది. లేటెస్ట్ గా మరో ట్విస్ట్ వచ్చింది.

సంక్రాంతి వస్తోందంటే జనాల్లో సంబరమే సంబరం. మామూలు సంబరం కాదు.  అంబరాన్నంటే  సంబరం. ఇక .. సినిమావాళ్ల సంతోషమైతే మరీను. ఆ సమయంలో తను నటించిన సినిమా రిలీజవుతుంటే ఆ హీరోల మనసంతా  మూవీనే. ఇక ఆ హీరోల ఫ్యాన్స్ కైతే పట్టపగ్గాలుండవు. లెజెండ్ బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150  ఈ సంక్రాంతికే విడుదలవుతున్నాయి. ఇందులో ఓ సినిమా గురించి ఓ హ్యాపీ న్యూస్ తెలిసింది.

ఈ మూవీ దాదాపు  కంప్లీట్ అయిపోయింది  కాబట్టి ఆడియో ఫంక్షన్ కోసం యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఫ్యాన్స్ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. రామ్‌చరణ్ ‘ధృవ’కూడా  రెడీగా ఉంది. ధృవ రిలీజ్  తర్వాతే ‘ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ జరిపితే  బాగుంటుందని  యూనిట్ అనుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ రెండో వారంలో మెగాస్టార్ మూవీ ఆడియో ఫంక్షన్ ఉంటుందని టాక్. ఇంతకూ అసలైన ఇన్ ఫర్మేమేషన్ ఏంటంటే మెగా మూవీ ఆడియో ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో‌పాటు  టాలీవుడ్ టాప్ స్టార్స్ హాజరు కావచ్చట.  నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు వంటి సీనియర్ హీరోలకు ఇప్పటికే ఇన్విటేషన్లు అందాయట. వీరితోపాటు చిరంజీవి‌తో చిత్రాలు చేసిన డైరెక్టర్లను కూడా  ఆ ఫంక్షన్ కు ఆహ్వానించారట.

Leave a Reply

Your email address will not be published.