‘బాహుబలి’ బర్త్ డే రేపే

హీరోలు చాలామందే ఉన్నారు. అయితే అందరిలో హీరోకు కావలసిన అన్ని అర్హతలూ ఉండకపోవచ్చు.  కొన్నిక్వాలిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. కొంతమంది హీరోలు నటనలో సాటిలేనివారే కావచ్చు. కానీ అంత అందంగా ఉండరు.మరికొందరికి మంచి పర్సనాలిటీ ఉండదు. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అందగాడు ప్రభాస్. రేపు అతని  బర్త్ డే. బాహుబలి-2 లో కనిపించబోయే అతని రూపం తొలి చిత్రాన్ని అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేసి అభిమానుల్లో ఒకరోజు ముందే ఆనందోత్సాహాలను రేకెత్తించారు.

ప్రభాస్ అంటే చాలు ఇప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది బాహుబలి. ప్రభాస్ పేరు చెప్పినా, చెప్పకపోయినా బాహుబలి అంటే చాలు. ఆ సినిమాతో అంతగా పాపులర్ అయ్యాడు. సినిమా పేరే ఇంటిపేరుగా చెలామణి అయిన వారున్నారు. ప్రభాస్ కూడా ఆ కేటగిరీ కిందకే వస్తాడు. బాహుబలి ప్రభాస్ కెరీర్ లో, లైఫ్ లో నిలిచిపోయే ఒక లెజెండ్.

ఆరడుగుల ఆజానుబాహువు, అందగాడు ప్రభాస్ అసలు పేరు…. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ప్రభాస్ కు సహజంగానే సినిమాలపట్ల ఇష్టం ఏర్పడింది. తండ్రి సూర్యనారాయణ రాజు సినీ నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు రెబెల్ స్టార్ . పెదనాన్న లక్షణాల్ని ప్రభాస్ పుణికిపుచ్చుకున్నాడు. కృష్ణంరాజు లాగే ప్రభాస్ కు పర్సనాలిటీ, అందం, నటన అన్నీ ఉన్నాయి.

ఆరడుగుల అందగాడు లవ్ లీ కేరక్టర్లే కాదు… వీరోచితమైన రోల్స్ కూడా వేశాడు. హీరోల్లో ఎవరికీ రాని అదృష్టం ప్రభాస్ ను వరించింది. ఒక్క సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అయితే ఆ కీర్తి వెనక ఎంతో శ్రమ ఉంది. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టం చూస్తే …మరే హీరో కూడా అంత స్ట్రెయిన్ తీసుకోరేమో అనిపిస్తుంది. ఆ మూవీకోసం డే అండ్ నైట్ ప్రభాస్ పడిన, పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభించడం విశేషం.

ప్రభాస్ చేసింది  తక్కువ సినిమాలే అయినా హిట్స్ ఎక్కువ. పైగా ఒక సినిమాకోసం ఒక హీరో మరే పిక్చర్ చేయకుండా…. సంవత్సరాల తరబడి డిడికేట్ కావడం ఇంతవరకు మరే హీరో చేయలేదనే చెప్పాలి. హ్యాట్సాఫ్ ప్రభాస్. అతని వన్స్ ఎగైన్ బర్త్ డే విషెస్ చెబుతున్నాం.

Leave a Reply

Your email address will not be published.