టాలీవుడ్ లోనూ హాలోవీన్ ట్రెండ్

గత రెండు రోజుల నుండి హాలోవీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు హాలోవీన్ అనగా చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు దెయ్యాలు, భూతాల గెటప్ లు వేసుకొని అందరిని అలరిస్తుంటారు. ఈ సారి సెలబ్రిటీ ఫ్యామిలీస్ కూడా ఈ డేపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్‌, నిహారిక తో పాటు మంచు ఫ్యామిలీ కూడా ఈ డేని సెలబ్రేట్‌ చేసుకుంది.

హాలోవీన్ పార్టీ  కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో బాగా తక్కువే. పైగా టాలీవుడ్ తారలు హాలోవీన్ పార్టీ చేసుకోవడం అంతగా బయటికి రాని విషయం. కానీ ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ జాంబీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కేరక్టర్లతో కూడా పరిచయం పెరుగుతోంది. జాంబీ మూవీలకు డిమాండ్ పెరిగాక.. హాలోవీన్ పార్టీల ట్రెండ్ టాలీవుడ్ కి కూడా పాకిందనే చెప్పాలి.

ఇటు యూకే లోను.. అటు అమెరికాలోను అక్టోబర్ 31 సాయంత్రం హాలోవీన్ ఈవెనింగ్ గా జరుపుకోవడం తర తరాల నుండి వస్తోంది. అక్కడి ఆచార వ్యవహారాలను మన వాళ్ళను కూడా పాటిస్తూ ఈ హాలోవీన్ డేని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సారి సెలబ్రిటీ ఫ్యామిలీస్ కూడా ఈ డేపై ప్రత్యేక శ్రద్ద పెట్టాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్ లో కనిపించగా; అల్లు అర్జున్ తనయుడు అయాన్ బ్యాట్ మన్ గెటప్ లో కనిపించి సందడి చేశాడు.

సోషల్ మీడియాలో ఈ హాలోవీన్  పార్టీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ హాలోవీన్ గెటప్ లో రెడీ అవుతూ తమ పిక్స్ ని అప్ లోడ్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు తను నిర్వహిస్తున్న న్యూయార్క్ అకాడమీ – ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్ విద్యార్ధులతో ఈ హాలోవీన్ డేని పెద్ద పార్టీగా సెలబ్రేట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ కు చెందిన పలువురు చిన్నారులు హాలోవీన్ గెటప్స్ తో సందడి చేశారు. వారితో పాటు మంచు మనోజ్ కూడా ఈ హాలోవీన్ గెటప్ వేసుకొని హడావిడి చేశాడు.

Leave a Reply

Your email address will not be published.