సినిమా చూడాలంటే 100 ఏళ్లు ఆగాల్సిందే

ఒక సినిమా 2115 వ సంవత్సరం రిలీజ్ కాబోతుంది. మీరు విన్నది కరెక్టే వందేళ్ళ తరువాత ఓ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ నెల, తేదీతో సహా ఎనౌన్స్ చేసేసారు ఆ ఫిలిమ్ మేకర్స్. కనీసం ఆ చిత్రాన్ని నిర్మించిన వారు, నటించినవారుకూడా విడుదల తేదీకి జీవించి వుండరు. ఈ విచిత్రమైన ఆలోచన విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయకపోతేనే ఆ సినిమాను లెక్కచేయని నేటి పరిస్థితుల్లో వందేళ్ళు ఆ సినిమాకోసం ఎవరు ఎదురు చూస్తారో అర్ధం కాని ప్రశ్న.

ప్రపంచంలో ఎక్కడైనా సరే సినిమా చెప్పినదానికంటే రిలీజ్ కొంచెం లేటైతుందంటేనే పెదవి అభిమానులు విరిచేస్తారు. అయితే హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే తెరకెక్కించిన ‘100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్‌ సీ’ చిత్రం  మాత్రం ఏకంగా 2115వ సంవత్సరం నవంబర్‌ 18న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వందేళ్ళ తరువాత కూడా సినిమా అభిమానులు తమను తలుచుకోవడం కోసమే ఇటువంటి ఏర్పాటు చేసుంటారని కొందరు అంటున్నారు. సినిమా లాబ్ లో వుండగానే పైరసీ భూతం కాటు వేస్తున్న ఈ రోజుల్లో వంద సంవత్సరాలు ఆ సినిమాను దాచిపెట్టగలరా అనే ప్రశ్నను కొందరు లేవనెత్తారు. దాని దగ్గర ఆ చిత్ర మేకర్స్ దగ్గర సమాధానం వుంది.

వందేళ్ళ తరువాత రిలీజ్ కావల్సిన హండ్రెడ్ ఇయర్స్ ద మూవీ యు విల్ నెవర్ సీ సినిమా ఈ లోపు పైరసీ భారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ ని ఒక బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో పెట్టి వందేళ్ళ తరువాత ఆటోమ్యాటిక్ గా ఓపెన్ అయ్యేలా సెట్ చేసారట. వందేళ్ల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానిస్తారట. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు వీళ్లు కూడా ఈ సినిమా చూడలేరు. వారి వారసులే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.