30 లక్షల క్లబ్ లో త్రిష

యాక్టర్లు ఇప్పుడు తమ పబ్లిసిటీకి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. కొందరు తారలకైతే సోషల్ నెట్ వర్క్ బాగా కలిసొస్తోంది. సినిమాలున్నా లేకున్నా వీళ్లకు నెట్ వర్క్ ద్వారా మంచి ప్రచారం వస్తోంది. లక్షలాది మంది అభిమానులు ఏర్పడుతున్నారు. కొందరు హీరోయిన్స్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న సమంత ఓ రికార్డ్ సృష్టిస్తే, ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఆ లెవెల్ కు చేరింది.

ప్రస్తుతం కొందరు హీరోలు, హీరోయిన్లు ట్విటర్ లో హల్ చల్ చేస్తున్నారు. ఏదో ఒక సెన్సేషనల్ మేటర్ పెట్టి ఎట్రాక్ట్ చేస్తున్నారు. సినిమాల్లో హీరో డామినేషన్ ఉంటే .. .. ఇక్కడ మాత్రం హీరోయిన్లే ముందుకు దూసుకుపోతున్నారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ తో  జోష్ పుట్టిస్తున్నారు. ఇటీవల సమంత 30 లక్షల హిట్స్ తో  అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు  త్రిష కూడా  సేమ్ నంబర్ ను చేరుకుంది.

నిన్న మొన్నటిదాకా స్టార్ హీరోలతో యాక్ట్ చేసి సక్సెస్ లు సాధించిన త్రిష ఈమధ్య వరస ఫ్లాప్ లతో సతమతమవుతోంది.  సినిమాల్లోనే కాక నిజ జీవితంలో కూడా  కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి.  30 ఏళ్ల త్రిషకు ఆమధ్య ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అన్ని విధాలా మంచి సంబంధమనే అనుకున్నారు. కానీ పెళ్లయ్యాక  సినిమాలు చేయవద్దని అతను కండిషన్ పెట్టడంతో త్రిష ఆ సంబంధాన్ని వదులుకుంది.

ఇంక పెళ్లే చేసుకోనని, మూవీ కెరీర్ పైనే కాన్ సెన్ ట్రేట్ చేస్తానని చెప్పింది త్రిష. సోషల్ మీడియాలో త్రిషకు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా సమంత  సాధించిన రికార్డ్ కు ఇప్పుడు త్రిష కూడా చేరుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా 30 లక్షల మంది నెటిజెన్స్ ఉన్నారు.

టాలీవుడ్ హీరోస్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు నెట్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు త్రిష, సమంత ఆ రికార్డుని క్రాస్ చేసి వారికంటే ముందున్నారు. ఈ రికార్డ్ సాధించినందుకు  త్రిష, సమంత చాలా హ్యాపీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.