కరణ్ జోహార్ కు మరో దెబ్బ

  • ఏ దిల్ హై ముష్కిల్ ను ప్రదర్శించరాదని థియేటర్ యాజమానుల నిర్ణయం

న్యూ ఢిల్లీ: కరణ్ జోహార్ కష్టాలకు అంతూ పొంతూ కనిపించడంలేదు. పాకిస్తాన్ నటుడు ఫవాద్  ఖాన్ తో ఆయన తీసిన సినిమా ఏ దిల్ హై ముష్కిల్ ఇంకా థియేటర్లకు చేరడానికి ఇంకా సమయం ఉండగానే, పాకిస్తాన్ నటులు నటించిన ఏ చిత్రాన్నీ ప్రదర్శించరాదని సినిమా ఓనర్ల అసోసియేషన్ శుక్రవారం జరిగిన ఒక సమావేశంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం సింగల్ స్క్రీన్ థియేటర్లు అన్నిటికీ వర్తిస్తుంది. పాకిస్తాన్ నటుడు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ భారత ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది కనుక దానిని థియేటర్లలో విడులచేయవద్దని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తన సభ్యులకు చెప్పింది. ఉరీ దాడులను పురస్కరించుకుని రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఇలాంటి మొట్టమొదటి సినిమా ఇదే.

ఇంతకు ముందు మహారాష్ట్రలో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన (ఎం ఎన్ ఎస్) బెదిరించింది. ఆ తర్వాత ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పాకిస్తాన్ నటులు నటించడం పై నిషేధం విధించింది కానీ, ఇప్పటికే పూర్తయిన సినిమాల విడుదలను అడ్డుకోవద్దని ఎం ఎన్ ఎస్ ను అర్థించింది. ఇప్పుడు విధించిన నిషేధం ప్రభావం పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ నటించిన  షారూఖ్ ఖాన్ సినిమా రాయీస్ పైన, అలీ జాఫర్ నటించిన డియర్ జిందగీ పైనా కూడా పడబోతోంది.

కరణ్ జోహార్ ఫవాద్ ఖాన్ ను తొలగించి రణ్ బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్కా శర్మ లతో తీస్తాడనే వదంతులు వ్యాపించాయి. కానీ ఆయన నిర్మాణ సంస్థ ధర్మ కు చెందిన వర్గాలు ఇండియన్ ఎక్స్ ప్రెస్ డాట్ కామ్ తో మాట్లాడుతూ ఆ వదంతులను తోసిపుచ్చాయి. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ బోర్డ్ ఆమోదం పొందింది. అక్టోబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published.