అభిమానం ‘గుడి’ కడుతోంది!

నటీనటులకు అభిమానులతో  పాటు  వీరాభిమానులూ ఉంటారు. హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలా అని హీరోయిన్లకూ  తక్కువేం కాదండోయ్. హీరోలకు బిగ్  కటౌట్స్ పెట్టి దండలేసి తమ అభిమానాన్ని చాటుకుంటే, హీరోయిన్స్ కు ఏకంగా గుడులే కడుతున్నారు. కథానాయికలకు ఆలయాలు కట్టడం తమిళనాడులో ఒక సంప్రదాయంగా  మారింది.

సినిమా హీరోలను, హీరోయిన్లను  ప్రత్యక్ష దైవాలుగా భావించి కొంతమంది పూజిస్తుంటారు. అభిమానించడమే కాదు, ఆలయాలు కూడా కడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో  ఈ ఆరాధన ఎక్కువ. ఆనాటి కథానాయకుడు మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ .. . ఎంజీఆర్ కు చెన్నై సమీపంలోని నాతమేడులో చాలాకాలం కిందటే గుడి కట్టి పూజలు చేస్తున్నారు.

ఎంజీఆర్ రాజకీయ వారసురాలు, అలనాటి హీరోయిన్, నేటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం జరుగుతోంది. వెల్లూరులో అమ్మ ఆలయం పేరుతో కట్టే ఈ గుడికి ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది.

నటి ఖుష్బూకు ఎంతో కాలం కిందటే తిరుచిరాపల్లిలో టెంపుల్ కట్టారు. నమితకు తిరునల్వేలిలోను, తమిళనటి పూజా ఉమాశంకర్ కు శ్రీలంకలోను  ఆలయాలు కట్టారు. హన్సికకు కూడా ఆలయం కట్టినట్టు చెబుతారు.

తాజాగా  అందిన సమాచారం ప్రకారం నటి కీర్తి సురేష్ కు కూడా ఆమె ఫ్యాన్స్  గుడి కట్టబోతున్నారట. నయనతారకు కూడా ఆలయం కడతానంటే ఆమె వద్దన్నది. ఇక హీరోల విషయానికి వస్తే ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కోల్ కతాలో గుడి కట్టారు.  ఇక రజనీకాంత్ కు ఎంతటి ఫాలోయింగ్  ఉందో చెప్పక్కర్లేదు. ఆయన పేరు మీద కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఆలయం ఉంది.

Leave a Reply

Your email address will not be published.