తమిళ డైరెక్టర్లపై టాలీవుడ్ క్రేజ్

మన టాలీవుడ్ హీరోలు ఈమధ్య తమిళ రీమేక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మలయాళీ సినిమాల్ని తెలుగులో తీయడానికి, లేదా రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా తెలుగులో తీసి వేరే భాషల్లోకి మార్చి రిలీజ్ చేసినా విజయం సాధిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, మన స్టార్ హీరోలు  తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇది టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన మార్పు.

టాలీవుడ్ హీరోలు  కొంతకాలంగా ఇతర భాషా చిత్రాలను, దర్శకులను, ఆయా మూవీల విజయాలను గమనిస్తున్నారు. ఆయా భాషల్లో తీసిన దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. రీమేక్స్ చేస్తున్నారు.ఒకప్పుడేమో కానీ ఇప్పుడు రీమేక్ పిక్చర్స్ సక్సెస్ అవుతున్నాయి.  తమిళంలో సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు.

లేటెస్ట్ గా తీసుకుంటే… సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ కూడా స్పీడ్ గా సాగుతోంది. ఈ దీపావళికి ఆ సినిమా టీజర్ కూడా రాబోతోంది. ఇక మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కూడా తమిళ డైరెక్టర్ తో పనిచేయడానికి కమిట్ అయ్యాడట. డైరెక్టర్ లింగుస్వామితో  ఓ పిక్చర్ చేయబోతున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా మరో తమిళ డైరెక్టర్ నేసన్ తో పిక్చర్ చేయబోతున్నాడు. 

అజిత్ హీరోగా తమిళంలో  తీసిన ‘వేదాళమ్’ మూవీ  గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమాను తెలుగులో పవన్ తో తీస్తారని ఆమధ్య అనుకున్నారు. ఇప్పుడు అది అమలు అవుతోంది. ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. తమిళ దర్శకుడు ‘నేసన్’ ఈ సినిమాను  డైరెక్ట్ చేస్తాడు.  ఈ సినిమా  నిర్మాత ఎఎం రత్నం.

Leave a Reply

Your email address will not be published.