కోలీవుడ్ కోటలో తెలుగు హీరోలు

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు రీమేక్స్ ఎక్కువయ్యాయి. అంతేకాదు… ఒకే సినిమాని తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు. ఒక్కోసారి తెలుగు, మలయాళ భాషల్లో కూడా తీస్తున్నారు. ఇందువల్ల టాలీవుడ్ హీరోలకు సౌత్ లో వేరే రాష్ట్రాల్లో మార్కెట్ పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ లోను, మల్లువుడ్ లోనూ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

ఇప్పటిదాకా తమిళ హీరోల హవా తెలుగులో కొనసాగుతోంది. విక్రం, కార్తి, సూర్య వంటి తమిళ  హీరోలు  తెలుగులోకూడా సక్సెస్ లు ఇస్తున్నారు. వారు యాక్ట్ చేస్తున్న మూవీస్ ను తెలుగు ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. మరి మన హీరోల మాటేంటి అనే ప్రశ్న వస్తుంది. మన హీరోలు సౌత్ లోని కోలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ లలో  సినిమాలు చేయరా అనే సందేహం, బాధ చాలాకాలంగా తెలుగు హీరోల అభిమానులను వేధిస్తున్నాయి.

కానీ ఇప్పుడు మన హీరోల ట్రెండ్ మారుతోంది. దక్షిణాది భాషా చిత్రాలను రీమేక్ చేయడమే కాదు, మన హీరోలు కూడా  ఆ లాంగ్వేజెస్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మన హీరోలతో సినిమాలు  తీస్తున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తున్నాడు. అలాగే  అల్లు అర్జున్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేస్తున్నాడు.  అల్లు అర్జున్ మూవీస్ కి మల్లువుడ్ లో ఇప్పటికే  మంచి మార్కెట్ క్రియేట్ అయింది.

మలయాళంలో మార్కెట్ తెచ్చుకున్న అల్లు అర్జున్  ఇప్పుడు కోలీవుడ్ పై లుక్కేశాడు. అక్కడి మార్కెట్ ను రాబట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. రెండు భాషల్లో వచ్చే తన మూవీకి రెమ్యునరేషన్ బదులు ఏరియా రైట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు కూడా ఇప్పుడు తను చేసే మురుగదాస్ సినిమాతో తమిళంలో పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నాడు.  జనతాగ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ కోలీవుడ్ లో పాగా వేశాడు.

టాలీవుడ్ హీరోలు ఇలా కోలీవుడ్, మల్లు వుడ్ లలో స్ట్రాంగ్ బేస్ ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. ఈ పోకడ చూసి కోలీవుడ్ హీరోలు కాస్త ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇంతకాలానికి టాలీవుడ్ హీరోల ఆలోచనల్లో మార్పు వచ్చి ముందడుగు వేస్తున్నారు. శుభం.

Leave a Reply

Your email address will not be published.