ఓవర్సీస్ లోనూ తెలుగు హవా

టాలీవుడ్ లో రోజులు మారిపోయాయి. ఇదివరకటి ఫార్ములాలు, మార్కెట్ అంచనాలు ఇప్పుడు ఛేంజ్ అయ్యాయి. ఆ రోజుల్లో తెలుగు సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యేవి.  ఇప్పుడు అలా కాదు వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది. ఓ మూవీ హిట్, ఫ్లాప్ లను ఓవర్సీస్ కలెక్షన్స్ ను బట్టే లెక్క కడుతున్నారు. ఓవర్సీస్ లో అయిదు తెలుగు సినిమాలు టాప్ కలెక్షన్స్ రాబట్టాయి.

ఒకప్పుడు మన తెలుగు సినిమాల మార్కెట్ తక్కువగా ఉండేది.  సినిమా బడ్జెట్లు, కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడు  కాలం మారింది, టాలీవుడ్ లో మార్పులు వచ్చాయి, ట్రెండ్స్ మారుతున్నాయి, మన సినిమాలు కొన్ని ప్రపంచ దేశాల్లో మార్కెట్ అవుతున్నాయి. స్టార్ హీరోస్ తో సినిమాతీస్తే ఓవర్సీస్ మార్కెట్ ఉంటుందని అర్థం చేసుకున్నారు కాబట్టి స్టార్స్ తో చేస్తున్న పిక్చర్స్ కు మొదటి నుంచీ  బ్రహ్మాండమైన  క్రేజ్ తీసుకొస్తున్నారు.

మూవీ మేకింగ్ లోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఓవర్సీస్ లో టాలీవుడ్ మూవీస్ కు క్రేజ్ ఏర్పడుతోంది. ఒక సినిమా జయాపజయాలు కూడా ఓవర్సీస్ మార్కెట్, కలెక్షన్స్ ను బట్టే డిసైడ్ చేస్తున్నారు.  ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమానే సక్సెస్ అయినట్టు లెక్కవేస్తున్నారు. విదేశాల్లో  తెలుగు, తమిళ, హిందీ పిక్చర్స్ మధ్య గట్టి పోటీనే ఉంది.

ఇతర భాషా చిత్రాలతో పోటీ ఉన్నా మన సినిమాలు ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్స్ రాబడుతున్నాయి. వసూళ్ల పరంగా బాహుబలి ఇప్పటికీ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. బాహుబలి ఓవర్సీస్ లో 46.88 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మిగతా సినిమాల గురించి చెప్పాలంటే… శ్రీమంతుడు 19.37 కోట్లు, అ..ఆ…16.38 కోట్లు, నాన్నకు ప్రేమతో… 13.53 కోట్లు, అత్తారింటికి దారేది 12.71 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.

త్వరలో రాబోయే బాహుబలి 2 మరింత ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఈమధ్య మన సినిమాలు 50 కోట్ల క్లబ్, 100 కోట్ల క్లబ్ లో చేరడం చూస్తుంటే టాలీవుడ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.