టీజర్ తొలగించిన విజయ్

అసలు కంటే కొసరుపై మోజెక్కువని ఓ  సామెత. ఇప్పటి సినిమాల ప్రమోషన్స్ చూస్తుంటే అది నిజమేమోననిపిస్తుంది. సినిమా రిలీజ్ కంటే ముందే టీజర్స్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్ ను విడుదల చేసేస్తున్నారు. వీటితో సినిమాకు క్రేజ్ వస్తుందని ఆ మూవీ మేకర్స్ ఆలోచన. కొన్ని సందర్భాల్లో టీజర్స్, ఫస్ట్ లుక్ లే మూవీకి మంచి పబ్లిసిటీ ఇస్తాయి. అయితే లేటెస్ట్ గా ఓ ట్విస్ట్ జరిగింది. ఓ నటుడు రిలీజ్ చేసిన తన మూవీ టీజర్ ను రిమూవ్ చేశాడట.

ఈ రోజుల్లో ఆడియన్స్ పై టీజర్స్ ఎఫెక్ట్ చాలానే ఉంటోంది. అది చూసి సినిమా ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా సినిమా రేంజ్ లో టీజర్స్ ని, ట్రైలర్స్ ని తయారుచేసి వదులుతున్నారు. అయితే హీరో విజయ్ ఆంటోనీ మాత్రం ఇందుకు రివర్స్ లో వెళ్లాడు. అదెలాగంటే…తను నటిస్తున్న సైతాన్ మూవీ టీజర్ ను తన ఫేస్ బుక్, ట్విటర్, యూ ట్యూబ్ లో పెట్టాడు. ఓకే. బాగానే ఉంది.

బిచ్చగాడు పిక్చర్ తో పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ సైతాన్ పేరుతో మూవీ చేస్తున్నాడు. తెలుగులో ఇది భేతాళుడు పేరుతో వస్తోంది. ఈ సినిమాలో సైతాన్ గా విజయ్ నటిస్తున్నాడు. ప్రముఖ తమిళ గీత రచయిత అన్నామలై ‘బేతాళుడు’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కొన్ని సంస్కృత పదాలను వాడాడు. ఆ పదాలు వేదాల్లోని శ్లోకాల నుంచి తీసుకున్నవి. సైతాన్ పాత్ర ఆ పదాలను వల్లిస్తుంది.

వేదాల్లోని శ్లోకాలకు ఎంతో మహిమ ఉంది. నిష్టగా వాటిని పఠించాలి తప్ప ఎలాగంటే అలా వల్లించకూడదు. దయ్యాలు వేదపఠనం చేయవు. అందుకే ఎవరైనా చెడ్డవాడు నీతులు చెబితే…. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని అంటారు. విజయ్ మూవీలో భేతాళుడు వేదాలు వల్లించినట్టు ఉంటుందట. అందుకే కొన్ని హిందూ మత సంస్థలు విజయ్ టీజర్ పై అభ్యంతరం తెలిపాయి.

మత సంస్థలు అభ్యంతరం చెప్పడంలోని అంతరార్థాన్ని, కారణాన్ని అర్థం చేసుకున్న విజయ్ ఆంటోని యూ ట్యూబ్ లో తన సైతాన్ టీజర్ ను డిలిట్ చేస్తున్నానని, కొత్త గీతాలతో మరో టీజర్ ను అప్ లోడ్ చేస్తానని స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published.