తమన్నా సినిమా తీస్తుందట

హీరోల్లో స్టార్ డమ్ ఉన్నవారు లేదా నార్మల్ రేంజ్ లో ఉన్న వారు కొందరు ఆల్ రెడీ  ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలు తీస్తున్నారు.  డైరెక్షన్ చేద్దామనే ఆలోచన ఎవరికీ అంతగా కలగడం లేదు. నటీమణుల్లో ఈ సిట్యుయేషన్ రివర్స్ గేర్ లో ఉంది. హీరోయిన్ గా చేస్తూ డైరెక్షన్ వైపు వెళ్లిన వారున్నారు. అయితే, చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారు తక్కువే. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ ప్రొడ్యూసర్ గా మారబోతోంది. ఆమే తమన్నా.

గతంలో కొద్దిమంది హీరోయిన్స్ నిర్మాతలుగా మారారు. బాలీవుడ్ లో హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ గా మారడం మామూలే. అయితే ఇప్పుడు దక్షిణాది తారల వంతు వచ్చినట్టుంది.  తీరికలేకుండా మూవీస్ చేస్తూ  మంచి పొజిషన్ లో ఉన్న  మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నిర్మాతగా మారుతోంది. తమన్నా మూవీ కెరీర్ లో బాహుబలి ఓ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ తర్వాత తను చేసిన సినిమాలు వరసగా హిట్టయ్యాయి.

ఈ ఏడాది తమన్నాకు బాగా కలిసొచ్చింది. తమిళంలో ఆమె చేసిన తోళా, దర్మదురై సినిమాలు హిట్టయ్యాయి. రెండు మూడేళ్లుగా తమన్నా యాక్ట్ చేసిన సినిమాలు ఏడాదికి నాలుగైదు రిలీజవుతున్నాయి. గత ఏడాది ఎక్కువగా తెలుగులోనే చేసింది. ఈ ఏడాది ఊపిరి మూవీ తమన్నా కు మంచి పేరు తెచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా మిల్కీ బ్యూటీకి చేతినిండా పిక్చర్స్ ఉన్నాయి.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా తమన్నా  తన డాడీకి నగల బిజినెస్ లోనూ హెల్ప్ చేస్తోంది. ఇప్పుడు మంచి సినిమా తీసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్స్  ప్రొడ్యూసర్లు కావడం చాలా రేర్. పైగా నటిగా ప్రొఫెషన్ వేరు. ప్రొడ్యూసర్ పాత్ర వేరు. నిర్మాతకు రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్ ఎక్కువ. మరి తమన్నా  వాటికి ఎలా రెడీ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.