తమిళ్ లో బిజీ బిజీగా తమన్నా

హీరోయిన్స్ కు ఒక్కో సీజన్ ఉంటుంది. ఆ సీజన్ లో వాళ్లకు చాలా  సినిమాలు  ఉంటాయి. తర్వాత ఎందుకో ఒక్కసారిగా డౌనై పోతారు. పిక్చర్స్ తగ్గుతాయి. రిలీజైన సినిమాలు, రిలీజ్ కాబోయే సినిమాలు తప్ప కొత్త సినిమాలు ఏవీ చేతిలో ఉండవు. అయితే ఏదో ఒక భాషలో తక్కువగా చేస్తున్నా, మరో భాషలో బిజీగానే ఉంటారు. ఇప్పుడు తమన్నా పరిస్థితి అలాగే ఉంది.

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే ఆడియన్స్ కు యమ క్రేజ్. స్టార్ హీరోలతో చేసి హిట్లు కూడా ఇచ్చింది. ఈ ఏడాది తెలుగులో ఈ అవంతిక సినిమాలు నాలుగు వచ్చాయి. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే ఎక్కువే అని చెప్పాలి.  స్పీడున్నోడు, ఊపిరి, జాగర్, అభినేత్రి చేసింది తమన్నా. వీటిలో స్పీడున్నోడు తప్ప మిగతా మూడూ రెండు మూడు భాషల్లో తీసిన సినిమాలు.

అభినేత్రి, జాగ్వర్ సినిమాలు లేటెస్ట్ గా రిలీజయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ఊపిరి తమ్మూకు మంచిపేరు తెచ్చింది. తమ్మూ ఇప్పుడు బాహుబలి -2 లో చేస్తోంది. ఈ సినిమా తర్వాత మిల్కీ బ్యూటీకి తెలుగులో సినిమాలు లేవనే చెప్పాలి. అభినేత్రిలో తమన్నా మంచి కేరక్టర్ చేసినా ఆ సినిమా అంచనాకు తగ్గట్టు ఆడలేదు.

తెలుగులో తమ్మూకు ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేవు. తెలుగులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు.  అయితే తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో చేస్తూ మాంఛి జోరుమీద ఉంది. అక్కడ శింబు, విశాల్ లతో  తమన్నా పిక్చర్స్ చేస్తోంది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నందువల్లే  తమన్నా తెలుగులో కొత్త సినిమాలు అంగీకరించడం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.