పాకిస్తాన్ తో చర్చలకు ఫారూక్ డిమాండ్

  • వోట్ల కోసం యుద్ధవాతావరణ సృష్టించవద్దని వ్యాఖ్య

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ తో బేషరతుగా భారత్ చర్చలకు దిగాలని జమ్ము-కాశ్మీర్ లోని వివిధ ప్రతిపక్ష నేతలతో సమావేశమైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు డా. ఫారూక్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. ఇప్పుడున్న యుద్ధ వాతావరణాన్ని నివారించాలని, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉగ్రవాదాన్ని అరికట్టడం కన్నా మరింత ఎక్కువగా పెంచి పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వోట్ల కోసం ఇలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని ఆయన సలహా ఇచ్చారు. రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయం చేయద్దని సూచించారు. సర్జికల్ దాడులపై కానీ, ఉరీపై జరిగిన దాడిపై కానీ ఇప్పుడు తాను మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ కూడా ఈ సమావేశంలో పాల్గొంది.

ఒక పక్క శ్రీనగర్ పై టెర్రరిస్టుల దాడిని సైన్యం ఎదుర్కొంటున్న సమయంలోనే ఫారూక్ అబ్దుల్లా పాకిస్తాన్ తో చర్చలు జరపాలని సూచించడంపై పలువురు ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఇది గత 25 రోజుల్లో ఉగ్రవాదులు జరిపిన 6వ దాడి అని వారు గుర్తు చేశారు. చర్చలకు మనదేశం ఎన్నడూ వ్యతిరేకం కాదనీ, కానీ చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచవలసిన బాధ్యత ఇప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ దే నని బీజేపీ వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published.