సెల్వ రాఘవన్ తో సూర్య మూవీ

వైవిద్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ సూర్య. ఈ ఏడాది 24 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఏడాది చివరన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదల కాక ముందే ఇటీవల ఓ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తాజాగా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పీడుకి బ్రేకుల్లేవు . సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎస్-3 రిలీజ్ కి రెడీ అయిపోతోంది. సింగం సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై.. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బోలెడన్ని అంచనాలు ఉండగా.. డిసెంబర్ 16న థియేటర్లలోకి వచ్చేందుకు షెడ్యూల్ చేశారు. వెయ్యి.. ఐదొందల నోట్ల రద్దు వ్యవహారం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా.. ఇంకా నెల రోజుల గ్యాప్ ఉండడంతో.. అప్పటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాడు సూర్య.

ఇక రీసెంట్ గా విఘ్నేష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించాడు. ‘తానా సెరిందా కూట్టం’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుండగా, త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని యూనిట్ భావిస్తోంది. తాజాగా మరో సినిమాను ఎనౌన్స్ చేసాడు సూర్య. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న సెల్వ రాఘవన్ దర్వకత్వంలో తన తర్వాతి చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు.

సూర్య 36 టైటిల్ తో ప్రచారం పొందుతున్న ఈ చిత్రం విఘ్నేష్‌ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ తర్వాత పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి సూర్య ట్వీట్ చేస్తూ, సెల్వ రాఘవన్ తో చేతులు కలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రభు నిర్మాతగా సూర్య36 తెరకెక్కనుందని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published.