అన్నయ్యకి సపోర్ట్

ఇజం ట్రైలర్  విడుదలైనప్పటి నుండి ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ మాస్ మసాలా సినిమాలే చేశాడు. యూత్ అప్పీల్ ఉన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు చేయలేదు. ‘ఇజం’ తో ఆ లోటు తీర్చేలా కళ్యాణ్ రామ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ గెస్ట పాత్రకు స్టార్ హీరోని తీసుకోబోతున్నారని తాజా వార్త.

పూరీ జగన్నాథ్‌, కళ్యాణ్‌ రామ్‌ కాంబినేషన్ లో ఇజం అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ భారీ హిట్‌ కొడతాడని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రానికి కంటెంట్ కీలకం కానుండగా, పూరి లాంటి పెద్ద దర్శకుడితో కళ్యాణ్ రామ్ కలలు నిజమవుతాయని కొందరి అంచనా. కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘ఓం 3డి’ తర్వాత అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇదేనట.

కళ్యాణ్ రామ్‌ తన కెరీర్లో చాలా కీలకమైన, ప్రత్యేకమైన ఈ సినిమాకు అన్ని రకాల ఆకర్షణలు జోడించే క్రమంలో భాగంగా తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ క్యామియో రోల్ చేయిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరితో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. ‘టెంపర్’తో అతణ్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది పూరీనే. పైగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాను కూడా అతనే డైరెక్ట్ చేస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గెస్ట్‌ రోల్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుండగా ‘జనతా గ్యారేజ్’ హిట్‌తో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలొ నటించేందుకు రెడీ అయ్యాడట. ‘ఇజం’లో ఎన్టీఆర్ కనిపిస్తే ఆ తీరే వేరుగా ఉంటుందని సమాచారం. కల్యాణ్ రామ్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని గతంలో ఒక సందర్భంలో ఎన్టీఆర్ అన్నాడు. అందువలన పూరి, కల్యాణ్ రామ్ కోరితే, గెస్టు రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పడం ఖాయమని టాక్.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.