గుంటూరు టాకీస్ 2 లో సన్నీలియోన్

మరోసారి సన్నీలియోన్ టాలీవుడ్ లో తళుక్కుమనబోతుంది. మంచు మనోజ్ సినిమా కరెంట్ తీగలో ఒక మెరుపు మెరిసి వెళ్లిన సన్నీలియోన్ ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయిలో అందాలు ఆరబోయడానికి వచ్చేస్తుంది. గతంలో చిన్నపాటి బూతు సినిమాగా పేరు తెచ్చుకున్న ఓ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న చిత్రంలో సన్నీలియోన్ నటించబోతుంది.

ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో రేష్మీ హీరోయిన్ గా వచ్చిన సినిమా గుంటూర్ టాకీస్. ఈ సినిమాతో రేష్మీ కి మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశం దక్కింది. రేష్మీని హాట్ హీరోయిన్ గా పరిచయం చేసింది ఈ సినిమా. గుంటూర్ టాకీస్ సినిమా కొంత హాట్ గా వుండి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోయినప్పటికి కలెక్షన్ల వర్షం మాత్రం కురిసింది. ఇందుకు కారణం ఆ చిత్రం యూత్ కి బాగా ఎక్కడం. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. అందులో ఈ సారి సన్నీలియోన్ హీరోయిన్ గా నటించబోతుందట.

గుంటూర్ టాకీస్ మూవీలో రేష్మీ గౌతమ్ ఎక్స్ పోజింగ్ కే కలెక్షన్లవర్షం కురిసింది. ఇప్పుడు గుంటూర్ టాకీస్2 లో హీరోయిన్ గా సన్నీలియోన్ చేస్తే ఇక ఆ సినిమా ఏరేంజ్ లో వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తార్ మాతృక సినిమాతో బిజీగా వుండటంతో పార్ట్2 ని రాజ్కిరణ్ తో డైరెక్ట్ చేయించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

పోర్న్ స్టార్ గా తనపై వున్న ముద్రను పోగొట్టుకోవడానికి సన్నీలియోన్ ఎంత ప్రయత్నించినా అది పోవడంలేదు. తను చేసిన సినిమాల కంటే బాలీవుడ్ లో ఎక్కువ పేరే తెచ్చుకున్నప్పటికి ఆశించినటువంటి చిత్రాల్లో మాత్రం అవకాశాలు రావడంలేదు. దీంతో సన్నీలియోన్ సౌత్ పై దృష్టిపెట్టిందని అంటున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో నటించి సౌత్ వారికి దగ్గరైంది. గుంటూర్ టాకీస్ 2 తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది సన్నీలియోన్.

Leave a Reply

Your email address will not be published.