సుమంత్ వర్సెస్ చైతు?

చాలా రోజుల తరువాత అక్కినేని కుటుంబ హీరోలందరూ మాంచి ఊపు మీద కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం.. ఇప్పుడు ప్రేమమ్ సినిమా కూడా దానినే ఫాలో అవ్వడం అందరికీ ఆనందం కలిగించే విషయమే. ఇప్పుడు అదే రూటులో వెళ్ళి జెండా పాతేయడానికి మన సుమంత్ కూడా వచ్చేస్తున్నాడు. కాని అక్కడే ఒక చిన్న ట్విస్టు ఉంది. ఈ చిత్రానికి పోటీగా మరో అక్కినేని హీరో సినిమా రానుందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక జనాకర్షణ ఉంటుంది. ఈ ఫ్యామిలీకి సంబంధించి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా  అభిమానులలో ఒక విధమైన ఎగ్జైట్ మెంట్‌ ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు తాజాగా డేట్ ప్రకటించారు

‘నరుడా డోనరుడా’  సినిమా ట్రైలర్ తో ఇప్పటికే టాలీవుడ్ ను బాగా ఇంప్రెస్ చేసిన సుమంత్‌ ఈ సినిమాలో ఉన్న సందేశం, కామెడీ, రొమాన్స్ తో అభిమానులలో అంచనాలు పెంచాడు. ఈ క్రమంలో సినిమా సూపర్ హిట్టయ్యేలా ఉందని కొందరు అంటున్నారు . పైగా హిందీలో ఇప్పటికే విక్కీ డోనార్ పెద్ద హిట్టు కాబట్టి,  తెలుగులో కూడా అదే రిపీటవ్వాలని స్వయంగా అన్నపూర్ణ సంస్థే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

సుమంత్‌ పక్కా ప్లానింగ్‌ తో రిలీజ్ కి రెడీ అవుతుంటే నాగ చైతన్య  నవంబర్ 11న సాహసం శ్వాసగా సాగిపో  సినిమాతో రెడీ అయ్యాడు. ఇప్పటికే చాలా ధియేటర్లలో చైతూ నటించిన ప్రేమమ్ సినిమా నడుస్తోంది. కాకపోతే ఇతర సినిమాలు ఖాళీ అయిపోయాయి కాబట్టి.. అక్కడ ‘నరుడా డోనరుడా’ సినిమాను దించుతున్నారు. ఇప్పుడు మళ్లీ వెంటనే సాహసం శ్వాసగా అంటే.. ధియేటర్ల అందుబాటు కుదురుతుందా అనేది అభిమానుల ప్రశ్న. మరి సుమంత్ అండ్ చైతన్య సినిమాల రిలీజ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.