దీపావళి సంబరాలలో తారావళి

ఎంత బిజీగా ఉన్నా సినిమా యాక్టర్లు కూడా పండగల్ని చాలా సంతోషంగా జరుపుకొంటారు. అందుకు కొంత టైమ్ కేటాయిస్తారు. నటీనటులు ఆనందంతో జరుపుకొనే పండగలు సంక్రాంతి, దసరా, దీపావళి. ఈ మూడు పండగల్లోనూ దీపావళి అంటే వారికి మరీ క్రేజ్. ఈ వెలుగుల  పండగను సంబరంగా జరుపుకొంటారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ సరే సరి. ఈ పండుగను ఎప్పుడూ బాగానే సెలెబ్రేట్ చేస్తాడు. ఈసారి కూడా తన ఆత్మీయులకు, బంధువులకు గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడు. ఇక త్రిభాషా సుందరి శ్రుతిహాసన్ .. షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చి  ఈసారి దీపావళిని తన నేటివ్  ప్లేస్ చెన్నైలో జరుపుకుంటోంది. ప్రస్తుతం  బాహుబలి- 2 షూటింగ్ తో బిజీగా ఉన్న  తమన్నా దీపావళిని తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకోడానికి ముంబై వెళ్లింది. తను దీపావళిని సెలెబ్రేట్ చేసుకోవడమే కాకుండా తన ఫ్యాన్స్ కు ఓ సలహా కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ.వాతావరణ కాలుష్యం కలిగించకుండా దీపావళి పండగను జరుపుకొంటానని, తన ఫ్యాన్స్ కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకోవాలని కోరింది. టపాసులవల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుందని, అందుకే తను కొన్నేళ్లుగా టపాకాయలు కాల్చడం లేదని మిల్కీ బ్యూటీ చెప్పింది. తన కుటుంబ సభ్యులతో  కలిసి గుడికి వెళ్లి పూజలు చేస్తానని తెలిపింది.

బాలీవుడ్ లో కూడా దివాలీ సంబరాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. సెలెబ్రిటీస్ దీపాల వెలుగుల మధ్య సెల్ఫీ దిగి ఫ్యాన్స్ కు పంపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్  దీపావళిని విందు వినోదాలతో  ఉత్సాహంగా  జరుపుకొంటున్నారు. షారుఖ్‌ ఖాన్, కరీనాకపూర్, కరిష్మా కపూర్, పూనమ్ పాండే, బిపాసా బసు, శిల్పా షెట్టి, రాఖీ సావంత్ వంటి టాప్ స్టార్స్ దీపావళి పార్టీల్లో పాల్గొంటున్నారు.

సామాన్యులకైనా , తారలకైనా దీపావళి ఆనందాల హేల. సరదాల మాల. సామాన్యుడు తన స్తోమతను బట్టి పండగ చేసుకుంటాడు. అదే సెలెబ్రిటీస్ అయితే టాప్ లెవెల్ లో జరుపుకొంటారు. ఈ దీపావళికి ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ సినిమాలూ రిలీజయ్యాయి. సామాన్యుడికి డబ్బులుండి మనసు బాగుంటే పండగ. సెలెబ్రిటీకి తన సినిమా హిట్ అయితే అసలైన పండగ.

Leave a Reply

Your email address will not be published.