చంపుతానని శృతి హాసన్ కు బెదిరింపు    

సినిమా సెలెబ్రిటీస్ హై క్లాస్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం నిజమే. కానీ వాళ్ల లైఫ్ లో లేనిపోని ప్రాబ్లెమ్స్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రముఖులు ఏది చేసినా పబ్లిసిటీ వస్తుందనే మాట అటుంచి, వాళ్లను రకరకాలుగా వేధించేవారూ, బెదిరించేవారు కూడా ఉంటారు. అసలు ముక్కూ, మొహం తెలీని వారి నుంచి చాలా ప్రమాదకరమైన బెదిరింపులు వస్తుంటాయి. లేటెస్ట్ గా శృతి హాసన్ కు  ఇలాంటి బెదిరింపు ఒకటి వచ్చింది.

టీజింగ్స్ , వేధింపుల రూట్ మారింది.  ఇదివరకు వెంటబడి వేధిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ పని చేస్తున్నారు. పైగా బెదిరిస్తున్నారు కూడా. ముఖ్యంగా  సెలెబ్రిటీస్ కు ఎవరో ముక్కూ మొహం తెలీని వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. శృతిహాసన్ కు చాలా సీరియస్ బెదిరింపే వచ్చింది. ఆమెను చంపేస్తానంటూ కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ ట్విటర్ లో బెదిరించాడట.

శృతిహాసన్  తన ఏజెంట్ ప్రవీణ్ ఆంటోనీ ద్వారా ఆ డాక్టర్ పై చెన్నై సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కర్ణాటకకు చెందిన కేజీ గురుప్రసాద్‌ అనే డాక్టర్ ట్విట్టర్‌ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 7 నుంచి తన అఫీషియల్ ట్విట్టర్‌ కు మెసేజ్‌లు పంపిస్తున్నాడని శ్రుతి  ఆ కంప్లైంట్ లో పేర్కొంది. అసభ్యకరంగా మెసేజెస్ ఇస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని  శృతి వెల్లడించింది.

తన గురించి ఆ డాక్టర్ ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్‌లను శ్రుతి స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఫిర్యాదుకు జత చేసిందట.  లోగడ కూడా శృతిహసన్ ఇలాంటి రిస్క్  ఫేస్ చేసింది. 2013లో శ్రుతిహాసన్‌ ముంబయిలోని బాంద్రాలోతన ఇంట్లో ఉన్నప్పుడుఓ దుండగుడు ఆమెను ఎటాక్‌ చేశాడు. అప్పుడు శృతి  వెంటనే రియాక్ట్ కావడంతోప్రమాదం ఏదీ జరగలేదు.

శృతిహాసన్ కే కాదు … ఈ మధ్య బాలీవుడ్  నటుడు సల్మాన్‌ఖాన్‌  కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. ముంబై సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి అతి త్వరలో సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని చెప్పాడు. వెంటనే పోలీసులు ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందో ట్రేస్ చేసి వెతికారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించారు.

 

Leave a Reply

Your email address will not be published.