శ్రీకాంత్ విలన్ గా బోయపాటి సినిమా

కొన్ని క్యారెక్టర్లను సృష్టించడంలో కొందరు డైరెక్టర్లు ఎక్స్ పర్ట్స్. కొందరు హీరోపైనే దృష్టి పెడితే మరికొందరు హీరోతోపాటు విలన్ మీదకూడా దృష్టిపెడతారు. కొందరు మాత్రం కమెడియన్లను హైలెట్ చేస్తుంటారు. బోయపాటి మాత్రం విలన్ ను చూపించడంలో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన తరువాతి సినిమాలో తనదైన శైలిలో ఓ హీరోను విలన్ గా చూపించబోతున్నాడు.

బోయపాటి శ్రీను అంటేనే మాస్ డైరెక్టర్. తన సినమాలో సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. హీరోకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో విలన్ కి అంతే ప్రాధాన్యత  ఇస్తాడు. హీరోకి ఎంత హీరోయిజాన్ని పెడతాడో విలన్ కీ అంతే పెడతాడు. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రంలో శ్రీకాంత్ ని విలన్ గా చూపించబోతున్నాడు.

లెజెండ్ సినిమాలో జగపతి బాబును విలన్ గా చూపిస్తూ బోయపాటి చేసిన ప్రయోగం విజయవంతం అయింది. బోయపాటి డైరెక్షన్ లో జగపతి బాబు విలన్ గా పక్కాగా సూటయ్యాడు. అక్కడి నుండి జగపతి బాబుకి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలయిందని చెప్పచ్చు. బాలకృష్ణకు పోటీ ఇవ్వడమంటే అంత ఈజీ విషయంకాదు. లెంజెండ్ సినిమాలో బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా జగపతి బాబు క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు బోయపాటి.

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాకి రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. మిర్యాల ర‌వీందర్ రెడ్డి నిర్మాత‌. ఈ సినిమాలోనే బోయపాటి శ్రీకాంత్ ని విలన్ గా చూపించబోతున్నాడు . శ్రీకాంత్ హీరో అవకముందు విలన్ గానే నటించాడు. ఆ అనుభవానికి  బోయపాటి డైరెక్షన్ తోడై ఈ కాంబినేషన్ మరోసారి ఇండస్ట్రీలో  హాట్ టాపిక్ కాబోతుంది. మరి బోయపాటి శ్రీకాంత్ లోని విలనిజంను ఏరేంజ్ లో చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.

Leave a Reply

Your email address will not be published.