శ్రీదేవి మూవీకీ చిక్కులు

పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద దాడులు జరగడం, మన ప్రభుత్వం ఆ దేశ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆ ప్రభావం సినిమా రంగంపై కూడా పడింది. మన దేశంలో తీసే సినిమాల్లో పాకిస్థానీ నటీనటుల్ని తీసుకోకూడదని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా మరో సినిమా కూడా అలాంటి సమస్యలోనే చిక్కుకుంది.

ఒకనాటి అందాల తార శ్రీదేవి నటిస్తున్న మామ్ పిక్చర్ షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయింది. ఇక ముంబయ్ లో చేయాల్సిన షూటింగ్ మాత్రమే మిగిలింది. అయితే ఈ షూటింగ్ కు చిక్కులు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఊరీలో దాడులకు పాల్పడిన అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిశాయి. మన సినిమాల్లో పాక్ నటీనటులు నటించకూడదని ఆందోళనలు జరుగుతున్నాయి.

శ్రీదేవి నటిస్తున్న మామ్ చిత్రంలో ఇద్దరు పాకిస్థానీ నటులుండడంతో ఆ సినిమా షూటింగ్ చిక్కుల్లో పడింది. పాక్ ఆర్టిస్టులు ఉంటే ఆ మూవీని విడుదల కానివ్వబోమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అంతకు ముందే ప్రకటించింది.

‘మామ్’ సినిమాలో అద్నాన్ సిద్ధికీ,   సజల్ అలీ అనే పాకిస్థానీ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఒకరు శ్రీదేవి భర్త పాత్రను పోషిస్తుంటే .. మరొకరు శ్రీదేవి కూతురు పాత్రలో నటిస్తున్నారు.

పాక్ నటీనటుల కారణంగా శ్రీదేవి మూవీకి సంబంధించిన ముంబయ్ షెడ్యూల్ ఆలస్యమవుతోంది.  కరణ్ జొహార్  ‘దిల్ హై ముష్కిల్’,   షారుఖ్   ‘రయీస్’ కూడా ఇలాంటి చిక్కుల్నే ఫేస్ చేశాయి. పాక్ నటుల్ని తీసుకుంటే…సైనిక నిధికి ఆ నిర్మాత కొంత మొత్తాన్ని  విరాళంగా  ఇవ్వాలని  షరతు పెట్టారు. ఏ దిల్ హై ముష్కిల్ నిర్మాత కరణ్ జోహార్ అందుకు అంగీకరించడంతో పిక్చర్ రిలీజ్ కు ఆటంకాలు తొలగాయి. మరి శ్రీదేవి మూవీ ‘మామ్’ సంగతి ఏమవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.