శ్రీదేవి కూతురితో జోహార్ సినిమా

శ్రీదేవి కూతురు జాహ్నవి తెరంగేట్రం విషయం పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది. అయినా పేరెంట్స్ మాత్రం ఇప్పటివరకూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జాహ్నవి ఎంట్రీ ఖరారైందనే  వార్త బాలీవుడ్‌ లో హోరెత్తుతోంది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి వెండితెర ఎంట్రీపై ప్రస్తుతం పలు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. గతంలో ఇలాంటి వార్తలే వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి మాత్రం శ్రీదేవి కూతురు ఎంట్రీ గురించి మాట్లాడుతూ జాహ్నవి ఇంకా చిన్నపిల్లేనని, చదువుకుంటుందని, తనపై ఇటువంటి వార్తలు రాయొద్దని మీడియాకు చెప్పింది. అయితే అదంతా గతం… కాని తాజాగా జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి అంతా సిద్దమైపోయిందని బాలీవుడ్ లేటెస్ట్ టాక్!

మొన్నటికి మొన్న మహేష్ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ ను సంప్రదించారని గాసిప్ లు హల్ చల్ చేశాయి. కాగా జాహ్నవి వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. కరణ్ జోహార్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న “సిద్దత్” అనే సినిమాలో జాహ్నవి నటించనుందని బీటౌన్ టాక్. సిద్దత్‌ సినిమాలో వరుణ్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తుందని ముందుగా వార్తలొచ్చాయి. తాజా కథనాల ప్రకారం శ్రీదేవి కుమార్తెను కరణ్ జోహార్ పరిచయం చేయాలనుకుంటున్నారట. “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” సినిమాతో ఆలియాను ఇంట్రడ్యూస్ చేసిన జోహార్, “సిద్దత్” సినిమాతో జాహ్నవి ని పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఇలా యంగ్ టాలెంట్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో కరణ్ స్పెషలిస్ట్ కావడంతో శ్రీదేవి కూడా అంగీకరించిందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.