షిండే మనవడి ప్రేమలో శ్రీదేవి కూతురు

చెన్నై: ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ల కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ లకు సినీ వర్గాలలో మంచి పేరు ఉంది. ఈ అమ్మాయిలిద్దరూ సోషల్ మీడియాలో తమ పోస్ట్ ల ద్వారా ఎందరి అభిమానాన్నో చూరగొంటున్నారు. అయితే, తను పోస్ట్ చేసిన ఒక ఫోటోతో జాహ్నవి హఠాత్తుగా వివాదంలో చిక్కుకుంది. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, తను ఒకరి పెదవులను ఒకరు స్పృశిస్తున్నట్టు ఆ ఫోటోలో ఉంది. ఆ ఫోటో సోషల్ మీడియా అంతటా వ్యాపించిపోయింది.

సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ హోమ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా. తన కూతురు అతనితో కలసి తిరగడం శ్రీదేవికి ఇష్టం లేదని తెలుస్తోంది. దాంతో కూతురిపై ఆంక్షలు పెట్టిందని ‘బాంబే మిర్రర్’ కథనం. కలసి తిరగడం కాదు సరి కదా, అసలు బాయ్ ఫ్రెండ్సే వద్దని కూతుళ్ళు ఇద్దరికీ శ్రీదేవి కచ్చితంగా చెప్పిందని అంటున్నారు. తను తల్లి అదుపాజ్ఞలలో పెరిగినట్టే, తన కూతుళ్ళు కూడా తను చెప్పినట్టు వినాలని ఖండితంగా చెప్పిందని తెలుస్తోంది. జాహ్నవి త్వరలోనే సినీ రంగప్రవేశం చేస్తుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.