ప్రభాస్ పెళ్ళి వార్తలు మళ్ళీ షురూ

ఈనెల 23న జరగబోతున్న ప్రభాస్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు అంతా ఎదురు చూస్తూ ఉంటే పుట్టినరోజు రాకుండానే మరోసారి ప్రభాస్ పెళ్ళి గురించి సోషల్  మీడియాలో  వార్తల హడావిడి మొదలైంది. గతంలో ప్రభాస్ పెళ్లి గురించి కొంతకాలం హాట్ న్యూస్ లు హడావిడి చేసి తరువాత అవి సద్దు మణిగాయి. కాని మరో సారి ఈ మ్యారేజ్ పై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి.

36 ఏళ్ల  మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న ఈ అమరేంద్రుడు ఎప్పుడు ఇంటివాడు  అవుతాడో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు లేటేస్ట్ గా ఓ వార్త వినిపించింది. కొందరు అభిమానులు  ఈ వార్త నిజం అయితే బాగుండును అని  కోరుకుంటున్నారు.  ‘బాహుబలి’ ప్రాజెక్ట్ కోసం అటు  వేరే సినిమాలు, ఇటు పెళ్లి కూడా చేసుకోకుండా  ప్రభాస్ దాదాపు ఐదేళ్లుగా ఈమూవీ కోసమే కష్టపడుతూ  వస్తున్నాడు.

‘బాహుబలి’ కోసం ప్రభాస్ పడ్డ కష్టానికి గుర్తింపు రావడంతో ఆయన ఇమేజ్ టాలీవుడ్ సర్కిల్ దాటి, బాలీవుడ్ బోర్డర్‌ను క్రాస్ చేసి మేడమ్ టుస్సాడ్స్‌ లో ప్రపంచ ప్రముఖుల సరసన తన మైనపు విగ్రహం ప్రతిష్టించే వరకు వెళ్లింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి-2′ షూటింగ్ చివరి దశలో ఉన్న నేపధ్యంలో ఈ ఏడాది చివరికి ప్రభాస్ రాజమౌళి  జైలు నుండి విడుదల అవుతాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ పెళ్ళి ప్రయత్నాలు మళ్ళి ఊపు అందుకున్నాయని వార్త.

 ‘బాహుబలి -2’ విడుదలకు ముందే ప్రభాస్ వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కొంతకాలంగా ప్రభాస్ కు తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్న కృష్ణంరాజు ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ హైటు, వెయిటు, అందానికి సరిజోడి అయిన అమ్మాయిని ఎంపిక చేసారిని తెలుస్తోంది. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త మళ్ళి హాట్ న్యూస్ గా మారి అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published.