సౌందర్య రజినికాంత్ వివాదం

మొన్న విడాకుల వివాదంలో చిక్కుకొని విమర్శలు ఎదుర్కున్న రజినికాంత్ చిన్నకూతురు సౌందర్య ఇప్పుడు కొత్తగా మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. రీసెంట్ గా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్‌ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన సౌందర్యకు తమిళనాడులో వ్యతిరేకత మొదలయింది. సౌందర్య ను ఆ పదవిని చేపట్టదంటూ దిష్టిబొమ్మలు కూడా తగలపెడుతున్నారు.

గత కొంత కాలం క్రితం రజినికాంత్ చిన్న కూతురు సౌందర్య భారత యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్ గా నియమించబడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి నిన్నమొన్నటివరకు రజినికాంత్ అభిమానులంతా చాలా సంతోషంగా భావించారు. అది తమ అభిమాన హీరో కూతురికి దక్కిన గౌరవంగా భావించారు. కాగా సడెన్ గా మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చి ఈ పదవే సౌందర్యకు తలనొప్పిగా మారే పరిస్థితిని తీసుకువచ్చింది.

సౌందర్యను భారత వెల్ఫేర్ బోర్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వెనుక పెద్ద కుట్రవుందనే అంశం కొత్తగా లేవనెత్తారు తిరుచ్చిలోని వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు. సౌందర్య ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వారు వ్యతిరేకించారు. సౌందర్య, రజనీకాంత్ చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. అయితే అక్కడి పోలీసులు సౌందర్య, రజనీకాంత్ చిత్ర పటాలు దహనం చేయడాన్ని అడ్డుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రజినికాంత్ కు వున్న పాపులారిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన కూతురిని తెరమీదకు తెచ్చి ఆమె ద్వారా తమిళనాడు జల్లికట్టు పై నిషేదం విధించడానికే ఈ పన్నాగం పన్నారని కళగం నిర్వాహకులు విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు లో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న జల్లికట్టు సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ సినిమా వాళ్ళు దుష్ప్రచారం చేయడం తగదని వారు డిమాండ్ చేస్తున్నారు. జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా సౌందర్య రజనీకాంత్‌ను ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయం అని కళగం నిర్వాహకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.