రజినికి తలనొప్పి

ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు…కొందరి జీవితాల్లో ఈ మూడూ చోటుచేసుకుంటుంటాయి. పెళ్లి అందరికీ కామన్ పాయింట్ అయినా, ప్రేమ- విడాకుల వ్యవహారాలు కొందరికే పరిమితమవుతున్నాయి. ఈ విషయంలో సినిమావాళ్లు సామాన్యులకేమీ తీసిపోరనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య లైఫ్ లో కూడా ఇలాంటి టర్నింగ్ పాయింట్ వచ్చింది.

వివాహ వ్యవస్థ బలంగా ఉన్న మనదేశంలో కూడా, విడాకులు కోరుకునే వారి సంఖ్య పెరుగుతునే ఉంది. ఈ విషయంలో సామాన్యులు, సెలెబ్రిటీలు అన్న తేడా ఏమీ లేదు. అయితే… ప్రముఖులకు సంబంధించిన  వారికి ఇటువంటివి జరిగితే వాటికి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. పదిమందీ చెప్పుకుంటారు. తాజా సమాచారం ఏంటంటే… రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య, ఆమె భర్త అశ్విన్ కుమార్ విడాకులకోసం ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు.

రజనీకాంత్ కూతురు సౌందర్య కు  2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్ తో వివాహం జరిగింది. అంతకు ముందు నాలుగేళ్లుగా ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అయితే… కొన్నేళ్ల కిందట ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి.  సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. అంతకు ముందు రజనీకాంత్ వీరిద్దరూ విడిపోకుండా నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.

విడాకులదాకా వెళ్లొద్దని, సర్దుకుపొమ్మని సౌందర్యకు రజనీకాంత్ సలహా ఇచ్చాడు. తండ్రి సలహా ఆమెకు నచ్చలేదు. విడాకులు తీసుకోడానికే  సౌందర్య నిర్ణయించుకుంది. ఆమె భర్త అశ్విన్ ను ఈ విషయం గురించి రజనీ అడగ్గా, అతనేమీ బదులివ్వలేదు. సౌందర్య – అశ్విన్ ల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

Leave a Reply

Your email address will not be published.