శివాని ఎంట్రీపై సస్పెన్స్

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని సాయి కొర్రపాటి బ్యానర్ వారాహి సినిమాలో నటిస్తుందని రీసెంట్ గా ఫిలింనగర్ లో టాపిక్ రేస్ అయింది.ఇప్పటికే శివాని ఒక సినిమాలో నటించి ఆ సినిమాను అనుకోనికారణాల వల్ల ఆగిపోవడంతో సైలెంట్ అయింది. సాయికొర్రపాటి చిన్న సినిమాలతో సక్సెస్ లు సాధిస్తూ మంచి నిర్మాత గా పేరు తెచ్చుకున్నాడు.అలాంటి సాయి కొర్రపాటి బ్యానర్ లో శివాని చేస్తుండటంతో ఈ వార్త దావానంలా పాకింది.

వారాహి చలనచిత్రం బ్యానర్ లో నాగశైర్య హీరోగా ఒక సినిమా జరగబోతుంది.హీరోయిన్ ని ట్రెడిషనల్ గా చూపించే సినిమాల్లో హీరోగా నాగశౌర్యను తీసుకోవడం అలవాటుగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది.అయితే వారాహి నాగశౌర్యతో చేయబోతున్న సినిమాలో రాజశైఖర్ పెద్ద కూతురు శివానిని హీరోయిన్ గా తీసుకుంటునట్లు వచ్చిన వార్తను జీవిత ఖండించిందట.

నాగశౌర్య తో శివాని తెరంగేఅట్రం చేయనుందనే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తల్లి జీవిత స్పష్టం చేసిందట. ప్రస్తుతం శివాని ఏసినిమాకు కమిట్ అవ్వలేదని, ఒకవేళ ఏదైనా మంచి స్క్రిప్ట్ దొరికితే ఆలోచన చేస్తామని అంది. ఇక నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఈ విషయంపై స్పందిస్తూ, తమ బ్యానర్ పై నాగశౌర్యతో ఒక సినిమా చేయనుండటం నిజమే కానీ. కథానాయికగా రాజశేఖర్ కూతురిని తీసుకున్నామనే వార్తల్లో మాత్రం నిజం లేదని, అసలు తమ సినిమాకి ఇంకా ఏ హీరోయిన్ ను అనుకోలేదంటూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

శివాని ప్రస్తుతానికి ఏ సినిమాలో నటించట్లేదనే విషయాన్ని మాత్రమే జీవిత స్పష్టం చేసింది.అయితే మంచి కథ వుంటే శివాని నటించడంలో ఎటువంటి అభ్యంత్రము లేదని చెప్పేసింది.అయితే శివాని ని ఎస్టాబ్లిష్డ్ హీరోతో లాంచ్ చేయాలని జీవితరాజశేఖర్ లు భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఒక సారి తెరమీదకు వచ్చిన తరువాత వెనక్కిపోని విధంగా సెటిల్ చేయాలనేది వారి ఉద్దేశ్యంగా తెలుస్తుంది.మరి శివాని ఎంట్రీ ఎవరితో జరుగుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.