తెలుగు జిల్లాల్లో సింగం-3 షూటింగ్

రెండు మూడు భాషల్లో మూవీలు తీయడం ఈమధ్య ఎక్కువవుతోంది. ఇలా  రెండు భాషల్లో  సినిమా తీసేవారు ఆయా భాషల ఆడియన్స్ కు బాగా పరిచయమున్న హీరోలనే ఎంచుకొంటున్నారు. ఇంకో విశేషమేంటంటే కేవలం హీరోను తీసుకోవడంతోనే ఆగిపోక రెండు భాషలు మాట్లాడే ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేస్తున్నారు. సింగం-3 సినిమా షూటింగ్ అలాంటి లొకేషన్స్ లోనే జరుగుతోంది.  

ఒక సినిమాని తమిళం, తెలుగు భాషల్లో తీసే అలవాటు ఇటీవల  పెరిగింది.  రెండు లాంగ్వేజెస్ లో ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోలు మనకున్నారు కాబట్టి ఒకేసారి రెండు లాంగ్వేజెస్ లో తీస్తున్నారు. సింగం సినిమాల్లో నటించిన హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఫెరోషియస్ పోలీస్ కేరక్టర్స్ వేసి సూర్య ఆడియన్స్ అభిమానం పొందాడు.

సూర్య నటిస్తున్న సింగం 3 మూవీ షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ ను తలకోన అడవుల్లో తీస్తున్నారు. సినిమా షూటింగ్స్ కు తలకోన పెట్టింది పేరు. సింగం 3 కోసం సూర్య-అనూప్ ఠాకూర్ సింగ్ లపై హై రేంజ్ లో ఉండే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ బాగా వస్తున్నాయని మూవీ యూనిట్ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సింగం 3 షూటింగ్ కూడా రెండు భాషా ప్రాంతాల్లో జరుగుతోంది.

ఇప్పటివరకు వచ్చిన రెండు సింగం సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఎప్లాజ్ వచ్చింది. దాంతో సింగం 3 టోటల్  షూటింగ్ పార్ట్ లో ఒక వంతు తెలుగు ప్రాంతాల్లో తీయాలనుకొన్నారు. విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సింగం 3 షూటింగ్ ప్లాన్ చేశారు. సూర్యకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉండడం వల్లే ఇలా ప్లాన్ చేశారంటున్నారు.  డిసెంబర్ 16న రిలీజయ్యే ఈ సినిమాలో సూర్యకు పెయిర్ గా అనుష్క, శృతిహాసన్  యాక్ట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.