సింగం కు ‘నో వేకెన్సీ’ సమస్య

బడా నిర్మాతలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ కి వుంటే మిగిలిన సినిమాలు విడుదల చేయకుండా ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద నిర్మాతల చేతుల్లో ఎక్కువ థీయేటర్లు వుంటుండటంతో వేరే వారికి వేకెన్సీ దొరికడం లేదు. ఇదే విషయంలో తమిళ్ హీరో సూర్య ఇబ్బందుల్లో పడ్డాడు. తన సినిమా రిలీజ్ కావడానికి కష్టాలు పడుతున్నాడు.

ఏ ఇండస్ట్రీలోనైనా బడా వ్యక్తులదే రాజ్యం. వారు ముందు, ఆ తరువాతే మిగిలిన వారు. ఈ ధోరణి సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువగా వుంటుంది. సూర్య సింగం -3 కి కూడా థియేటర్లు దొరకని బెడద పట్టుకుంది. అల్లు అరవింద్ నిర్మించిన ధృవ సినిమా రిలీజ్ కి వుండటంతో సింగం-3 అయోమయంలో పడింది.

డిసెంబర్ 2న విడుదల అవుతుందనుకున్న ధృవ డిసెంబర్ 9కి వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న అల్లు అరవింద్ తన చేతిలోని ధియేటర్స్ అన్నింటిని డిసెంబర్ 9కి బ్లాక్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పుడు ఈ నిర్ణయం తో   డిసెంబర్ 16 విడుదల చేద్దామనుకున్న ‘సింగం -3’ ని ఏ డేట్ కు వాయిదా వేయాలన్న టెన్షన్ లో నిర్మాతలు వున్నట్టు టాక్.

హీరో సూర్యకు అల్లు అరవింద్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా ఎనలేని గౌరవంతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో అరవింద్ మాటను తిరస్కరించలేని పరిస్థితి సూర్యకు ఏర్పడిందని అంటున్నారు.  అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం డిసెంబర్ 9న కూడ ‘ధృవ’ విడుదల కాకపోవచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.