కెరీర్ బిగినింగ్ లోనే హ్యాట్రిక్ కొట్టిన శ్రియ

కంటిచూపుతో కుర్రాళ్లను పడేసే అమ్మాయిలు మనకు తెలుసు. హీరోయిన్స్ కూడా తక్కువ కాదండోయ్. ఆ మాటకొస్తే ఎక్కువే. చూపుల గారడీ చేసి హీరోను పడేస్తుంటారు. ఆ తర్వాతే సినిమా కథ నడుస్తుంది. అలా హీరోను, ఆడియన్స్ ను పడేసే అందమైన కళ్లున్న టాలీవుడ్ హీరోయిన్ శ్రియ. ఎన్నో గ్లామర్ రోల్స్ వేసిన శ్రియ ఈమధ్య యాక్టింగ్ కు స్కోప్ ఉన్న మంచి పాత్రలూ వేస్తోంది. ముందుగా ఆమె బర్త్ డే కి  గ్రీటింగ్స్ చెబుతూ ఈ స్టోరీనీ చదవండి.

కెరీర్ బిగినింగ్ లో చిన్న కేరక్టర్స్ వేసి, తర్వాత స్టార్ అయిన వాళ్లున్నారు. శ్రియ కూడా ఆ రూట్ లోనే వచ్చింది. శ్రియకు మొదటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. నటి కాకుండా ఉంటే డాన్సర్ అయి ఉండేది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాక, ఇంగ్లీష్, కన్నడ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసిన క్రెడిట్ ఆమెకుంది. 2001లో ఇష్టంతో సినిమాల్లోకి వచ్చిన శ్రియకు ఆ వెంటనే వరసగా మూడు బంపర్ హిట్స్ వచ్చాయి. అలా శ్రియ హ్యాట్రిక్ కొట్టింది.

సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే సినిమాల ఘన విజయాలు ఆమె కెరీర్ కు పూలబాట వేశాయి. తర్వాత కొన్నేళ్లకు రజనీకాంత్ తో చేసిన శివాజీ మంచి పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలే కాక పవిత్ర వంటి నటనకు స్కోప్ ఉన్న కేరక్టర్లూ వేసింది శ్రియ. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో మనం సినిమా శ్రియకు సక్సెస్ ను ఇచ్చింది. ఆ సినిమాలో నాగార్జునతో గ్రామీణ యువతిగా చేసింది.

మనంలో మంచి రోల్ వేసిన శ్రియకు ఆ తర్వాత కూడా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలే వచ్చాయి. నటనకు ప్రాధాన్యమున్న కేరక్టర్స్ ను శ్రియనే చేయాలి అనే పేరుతెచ్చుకుంది. కేవలం సినిమాల్లో నటించడమే కాదు, సమాజ సేవ కూడా  శ్రియకు ఇష్టం. ఈమధ్య ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. ఇంకో విశేషమేంటంటే, టాలీవుడ్ హీరోయిన్స్ లో ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్ శ్రియకు వచ్చింది.

ఇదివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది శ్రియ. ఇప్పుడు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన కేరక్టర్స్ నే ఎంచుకుంటోంది. అవి ఆమెకు  పేరు తెస్తున్నాయి. సీనియర్ హీరోలు శ్రియనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. శ్రియ ఇప్పుడు బాలకృష్ణ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిలో మహారాణి పాత్ర వేస్తోంది. ఇది ఓ కీలకమైన కేరక్టర్. శ్రియ మరిన్ని మంచి కేరక్టర్స్ చేయాలని కోరుకుంటూ ప్రైమ్ పోస్ట్ ఆమెకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.