వీఐపి సీక్వెల్

ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని మరో బాషలో తీయడం చేస్తుంటారు. లేదా రీమేక్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ మూవీకి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తారు. ఇలా ఒక సినిమా సక్సెస్ పై ఎన్నో అంచనాలు తయారవుతాయి. ఆ విజయాన్ని అన్ని విధాలా వినియోగించుకునేందుకు ట్రై చేస్తుంటారు. నిజానికి ఇది సీక్వెల్స్, రీమేక్స్ ఏజ్. ఇప్పుడు మరో హిట్ పిక్చర్ సీక్వెల్ రాబోతోంది.

కొలవరితో ఇండియా మొత్తం ఫేమస్ అయిన ధనుష్ హీరోగా అదివరకు తమిళంలో  ‘విఐపి’ అనే సినిమా వచ్చింది. అది అక్కడ యమ హిట్ అయింది. ఆ టైంలోనే  అదే సినిమాను తెలుగులో ‘రఘువరన్ బీటెక్’ పేరుతో డబ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు  కూడా బాగా ఆదరించడంతో ఈ సినిమా ఇక్కడ కూడా హై రేంజ్ లో సక్సెస్ అయింది.

విఐపి రిలీజై కొంతకాలమైన తర్వాత ఇప్పుడు ఈ  సినిమాకి  సీక్వెల్  తీస్తారని కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఆ వార్త ఇప్పుడు ఖరారైంది. ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందిస్తున్న  సంగతి నిజమేనని ధ్రువీకరించారు. తమిళంతో పాటు తెలుగులోను ‘విఐపి -2’ పేరుతో ఈ సీక్వెల్ వస్తుందని ప్రొడ్యూసర్లు  చెప్పారు.

విఐపి సీక్వెల్ కు కళైపులి థాను నిర్మాత. తమిళ సూపర్ స్టార్ కూతురు సౌందర్య రజనీకాంత్ ఈ పిక్చర్ ను డైరెక్ట్ చేస్తుంది. నటుడిగా, గాయకుడిగా మనకు తెలిసిన ధనుష్‌  ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్  అందిస్తుండటం విశేషం. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published.