అఖిల్ రెండో మూవీకి ఆలోచనలు

తనయుడి ఉజ్వల భవిష్యత్ కోసం ప్రతి తండ్రీ తాపత్రయ పడతాడు. శ్రద్ధ తీసుకుంటాడు. సినిమా వారు కూడా  అంతే. కొడుకు మూవీ కెరీర్ బాగుండాలని ఆచితూచి అడుగులు వేస్తారు. మొదట్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తనయుల్ని హీరోలుగా నిలబెట్టిన వారున్నారు. కింగ్ నాగార్జున ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు.

నాగార్జున ఇద్దరు కొడుకుల్లో నాగచైతన్య వరసగా మూవీస్ చేస్తుంటే, అఖిల్ పరిస్థితి అలా లేదు. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో  అఖిల్ కొంతకాలం ఎటూ తోచని స్థితి లో ఉండిపోయాడు. అఖిల్ సెకండ్ పిక్చర్ కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ .. .. ఏదీ ఒక దారికి రాలేదు. ఏ డైరెక్టర్ తో చేయాలా అన్న విషయంలో చాలా చర్చలు జరిగాయి.

అఖిల్ రెండో సినిమా ఎటూ తేలకపోవడంతో  ఈలోగా పెళ్లి చేసేద్దామనుకున్నారు.  అయితే సడన్ గా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. అఖిల్ తో సొంతంగానే సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఫ్యామిలీ అంతా యాక్ట్ చేసిన ‘మనం’  గ్రాండ్ సక్సెస్ కావడంతో నాగ్ సెంటిమెంట్ ఫీలై, ఆ మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తోనే అఖిల్ సెకండ్ పిక్చర్ చేద్దామనే ఆలోచన చేశాడు.

అఖిల్ హీరోగా, విక్రంకుమార్ డైరెక్షన్ లో  గ్రాండ్ గా సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు విక్రమ్ కుమార్ 40 కోట్ల బడ్జెట్ చెప్పేసరికి నాగార్జున సెకండ్ ధాట్ లో పడ్డాడని తెలుస్తోంది. అఖిల్  రెండో మూవీకి అంత ఖర్చు అవసరమా అని ఆలోచిస్తున్నాడట. అదీగాక .. .. మొదటి సినిమా అఖిల్ వల్ల లాస్ అయిన బయ్యర్స్ ను  ఈ మూవీతో ఆదుకోవాలని  నాగార్జున ఆలోచిస్తున్నాడట.

అఖిల్ సెకండ్ పిక్చర్  బడ్జెట్ పై నాగార్జున, విక్రమ్ కుమార్ ఒక అవగాహనకు వస్తే, డిసెంబర్ లో మూవీకి పూజ ముహూర్తం పెట్టవచ్చు.  అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై తీయబోయే ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా కొత్త అమ్మాయిని తీసుకోవచ్చని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.