పవన్-త్రివిక్రమ్ సినిమాకు స్క్రిప్టు రెడీ

త్రివిక్రం, పవన్ కల్యాణ్ ల సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. పవర్ స్టార్ కాటమ రాయుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రం సినిమాను స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఈసారి సినిమాకు సినిమాకు గ్యాప్ లేకుండా వెంటవెంటనే చేయాలనేది పవన్ కల్యాణ్ ప్లాన్. కాగా త్రివిక్రం ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసాడని తెలుస్తోంది.

త్రివిక్రం- పవన్ కల్యాణ్  సినిమా అనగానే భారీ ఎక్స్ పెక్టేషన్లు  వుంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్ అది అయిన వెంటనే త్రివిక్రం డైరెక్ట్ చేయబోయే సినిమాలో నటించడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాడట. ఏ రోజు తను పూర్తి స్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడో తెలియని పరిస్థితిలో త్రివిక్రం సినిమాకు కమిట్ అయ్యాడు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వున్నాడు. సమస్యకు పరిష్కారం దొరికినా దొరకకపోయినా ప్రశ్నించడం మాత్రం చేస్తూనే వున్నాడు. ఆ తరువాత ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలోనూ అడగాల్సింది అడిగాడు, ఆ తరువాత కాటమరాయుడు షూటింగ్ కి వెళ్లి తన పని తాను చేసుకుంటున్నాడు.

పవన్-త్రివిక్రం ల సినిమాను వంద కోట్లతో నిర్మించబోతున్నారట. పవన్ కి వున్న స్టామినాకు వంద కోట్లు పెద్ద లెక్క కాదని త్రివిక్రం అనుకుంటున్నాడు. కాగా ఈ చిత్రానికి “దేవుడే దిగివచ్చినా” అనే టైటిల్ పెట్టారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందట. పవన్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రం ఈ సినిమా కథను రూపొందించాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.