సీఎంలకు శాతకర్ణి ప్రత్యేక షో

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ అహర్నిశలు కష్టపడుతున్నాడు. చిత్రం గ్రాండ్ గా వుండటంకోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ వేరే వాటికి ఖర్చుపెట్టిస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాను క్రిష్ తో పాటు బాలకృష్ణ కూడా చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాను అందరికంటే ముందు ఇద్దరు అతిరథులకు బాలకృష్ణ దగ్గరుండి చూపించాడలనుకుంటున్నాడట.

బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు ప్రజలను పాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడు. తెలుగు ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న ఈ రాజు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న సినిమా అవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

బాల‌కృష్ణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 100వ సినిమా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిని రిలీజ్ కు ముందుగానే ఇద్దరు సిఎం లకు చూపించబోతున్నారు. సంక్రాంతి బ‌రిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఎపి సిఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చూపించడానికి 2017 జ‌న‌వ‌రి 3వ తేదీన ప్రత్యేక షో వేస్తున్నారు. బాలకృష్ణే స్వయంగా ఈ ఏర్పాట్లను చూసుకోబోతున్నాడు.

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఓపెనింగ్ కి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆ సందర్భంలో సినిమా పూర్తయ్యాక తనకు చూపించాలని మరీ కోరాడు కేసీఆర్. ఆ వేదికపై వున్న ముఖ్య అతిథులందరం కలిసి సినిమా చూస్తామని బాలకృష్ణతో చెప్పారు కేసీఆర్. కేసీఆర్ కోరిక మేరకు బాలకృష్ణ కూడా ఇద్దరు సీఎం లకూ ఆ సినిమా చూపించబోతున్నాడు. అయితే,  ఆడియో వేడుక విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.