బాహుబలికి శాతకర్ణి పోటీ కాదు: రాజమౌళి

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతో టాలీవుడ్‌ కీర్తి దశదిశాలా విస్తరించింది. గుర్తింపు రావడమే కాక మన సినిమా మార్కెట్ కూడా పెరిగింది. గతంలో మాదిరిగా మళ్లీ హిస్టారికల్ మూవీస్ ఏజ్ నడుస్తోంది. గత ఏడాది రెండు హిస్టారికల్ మూవీస్ రిలీజ్ అయితే…ఈ ఏడాది మరో రెండు చారిత్రక చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది శుభసూచకం. అయితే బాహుబలి, శాతకర్ణి  ఒకదానికొకటి పోటీ కాదని దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించారు. వేటి స్థాయి వాటిదే నన్నారు.

బాలకృష్ణ శాతకర్ణి సక్సెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్ర విజయాన్ని కోరుకుంటూ యాగం కూడా చేసినట్టు సమాచారం. ఆయన తండ్రి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లోనే కాక, బొబ్బిలియుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, పల్నాటి యుద్ధం, చాణక్య-చంద్రగుప్త వంటి చారిత్రక సినిమాల్లోనూ నటించి మేటి అనిపించుకున్నారు. అయితే ఆ రోజులు వేరు. అప్పట్లో ప్రేక్షకులు హేమా హేమీలు నటించిన అన్ని రకాల సినిమాలనూ ఆదరించారు. తర్వాతి కాలంలో పౌరాణిక, చారిత్రక, జానపద సినిమాలకు ఆదరణ తగ్గింది.

ఎన్టీఆర్ , ఎస్వీఆర్ వంటి దిగ్గజాలను చూసిన కళ్ళతో అంత స్థాయి లేని నటులు లేకపోవడమూ ఇందుకు ఒక కారణం కావచ్చన్న అభిప్రాయమూ సినీ రంగంలో ఉంది. కానీ ఇటీవలి కాలంలో బాలీవుడ్ లోనూ తర్వాత టాలీ వుడ్ లోనూ చారిత్రక సినిమాల ట్రెండ్ మళ్ళీ మొదలైంది. సక్సెస్ రుచి కూడా చూస్తున్నారు. బాహుబలి పూర్తిగా చారిత్రక చిత్రం అనలేకపోయినా ఆ టచ్ ఉన్న సినిమా. ఆ సినిమా తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రనే తిరగ రాసింది. ఈ నేపథ్యంలో చారిత్రక సినిమాలలో తండ్రికి తగిన వారసుడి నని పించుకోవాలని బాల కృష్ణ ఆశిస్తే ఆశ్చర్యం లేదు.

Leave a Reply

Your email address will not be published.